ఈ 4 రాశుల వారికి కోపం చాలా ఎక్కువ.. ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తుల స్వభావం, ఆవేశం, సహనం, ఆలోచనా తీరు వంటివి రాశుల ప్రభావంతో ముడిపడి ఉంటాయి. కొన్ని రాశులవారికి కోపం సహజ స్వభావం. వీరు తప్పు జరిగితే సహించలేరు. కానీ అదే కోపం కొన్నిసార్లు వారి పనులు, బంధాలను కూడా ప్రభావితం చేస్తుంది.

కోపం ఎక్కువగా ఉండే రాశులు
ప్రతి వ్యక్తి స్వభావం వేరుగా ఉంటుంది. కొందరు ప్రశాంతంగా ఆలోచించి స్పందిస్తారు. మరికొందరు ఒక్క క్షణంలోనే కోపం తెచ్చుకుంటారు. కోపం అనేది సహజమైన భావోద్వేగం. కానీ కొన్ని రాశులవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రాశులవారు న్యాయం కోసం మాట్లాడుతారు. కానీ ఈ కోపం కొన్నిసార్లు వారి వ్యక్తిత్వానికి బలం కాగా, మరికొన్నిసార్లు వివాదాలకు కారణమవుతుంది. మరి కోపం ఎక్కువగా ఉండే ఆ రాశులేంటో చూద్దామా..
మేష రాశి
మేష రాశి వారు కుజుడి పాలనలో ఉంటారు. సాధారణంగా కుజుడిని యుద్ధ గ్రహంగా పరిగణిస్తారు. ఇది మేష రాశి వారికి అపారమైన శక్తి, తీవ్రత, దూకుడు స్వభావాన్ని ఇస్తుంది. వీరు సవాళ్లను, ఘర్షణలను ఎదుర్కోవడానికి వెనుకాడరు. ఎలాంటి పరిస్థితిలోనైనా పోరాడటానికి సిద్ధంగా ఉంటారు. వీరికి భావాలను దాచుకోవడం తెలియదు. ఏదైనా విషయం వారిని ఇబ్బంది పెడితే, దాన్ని బహిరంగంగా చెబుతారు. వారి ఈ నిక్కచ్చితనం కొన్నిసార్లు తీవ్రమైన వాదనలకు దారితీస్తుంది.
సింహ రాశి
సింహ రాశి వారికి సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అందరి దృష్టిని ఆకర్షించాలని కోరుకుంటారు. వారి వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తే, అహాన్ని నిరూపించుకోవడానికి గొడవకు దిగుతారు. సంబంధంలో గౌరవం లేదనిపిస్తే వాదనలకు దిగుతారు. చిన్న సమస్యలను కూడా పెద్దవి చేస్తారు. వారి గొడవ, ప్రేమ, గౌరవం, విశ్వాసం అన్ని తమకు గుర్తింపు దక్కాలనే కోరిక నుంచే వస్తాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు లోతైన భావోద్వేగాలు కలిగి ఉంటారు. వీరి గొడవలు తీవ్రంగా ఉంటాయి. ద్రోహం, అసూయను వీరు అస్సలు సహించలేరు. వారి ప్రతిచర్య బలంగా ఉంటుంది. వీరికి కోపం అంత సులభంగా తగ్గదు. బహిరంగంగా కాకుండా వ్యూహాత్మకంగా గొడవపడతారు. మాటలతో మానసికంగా దాడి చేస్తారు. వీరితో ఘర్షణ ఎదుటివారికి తలనొప్పి తెప్పిస్తుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు నిజాయితీపరులు. మనసులో ఏం పెట్టుకోరు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. నమ్మకాలు, నియమాలను ప్రశ్నించడానికి వెనుకాడరు. సత్యం గురించి చర్చించడానికి ఇష్టపడతారు. తమ స్వేచ్ఛకు ఆటంకం కలిగితే, నియమాలను ఉల్లంఘిస్తారు. ఇది తరచుగా గొడవలకు దారితీస్తుంది. వారి ముక్కుసూటి మాటలు కొన్నిసార్లు గొడవలను మరింత పెంచుతాయి.