- Home
- Astrology
- Moon Transit in Virgo: కన్యరాశిలోకి చంద్రుడు.. ఈ రాశులకు గోల్డెన్ టైమ్ స్టార్ట్ అయినట్లే
Moon Transit in Virgo: కన్యరాశిలోకి చంద్రుడు.. ఈ రాశులకు గోల్డెన్ టైమ్ స్టార్ట్ అయినట్లే
గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారుతూ ఉంటాయి. ఈ మార్పులు కొన్ని రాశులకు మేలు చేయనున్నాయి. మరో నాలుగు రోజుల్లో కన్య రాశిలోకి చంద్రుడు అడుగుపెట్టనున్నాడు. మరి, ఆ మార్పు.. ఏ రాశులకు అదృష్టాన్ని తేనుందో తెలుసుకుందాం..

గ్రహాలు తరచుగా మారుతూనే ఉంటాయి. ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారుతూ ఉంటాయి. ఇలా మారుతూ ఉండటం వల్ల కొన్ని రాశుల వారికి సమస్యలు వస్తే, మరి కొన్ని రాశులకు మేలు జరుగుతుంది. కొన్ని గ్రహాలు ఏదైనా రాశిలోకి అడుగుపెట్టాయి అంటే సంవత్సరాల కాలం ఉంటుంది. కానీ, కొన్ని రెండు, మూడు రోజులకన్నా ఎక్కువ ఉండవు. కానీ, దాని ప్రభావం మాత్రం గట్టిగా చూపిస్తుంది. ఇప్పుడు చంద్రుడు.. మీన రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. దీని ప్రభావం మూడు రాశులకు అదృష్టాన్ని మోసుకురానుంది.
ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన హనుమాన్ జయంతి జరుపుకోనున్నాం.హిందూ ధర్మం ప్రకారం అత్యంత పవిత్రమైన రోజు ఇది. ఈ రోజున హిందువులు ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా పూజలు చేసుకుంటారు.అయితే, ఈ శుభదినాన చంద్రుడు కన్య రాశిలోకి అడుగుపెట్టనున్నడు. జోతిష్యపరంగా ఇది చాలా శుభసూచకం. ఈ శుభం మూడు రాశులకు మాత్రం కచ్చితంగా రాసిపెట్టి ఉంది. మరి, ఆ అదృష్ట రాశులేంటో చూద్దాం..
telugu astrology
1.కన్య రాశి..
చంద్రుడు కన్య రాశిలోకి అడుగుపెట్టడం కన్య రాశి వారికి చాలా మేలు చేస్తుంది.ఈ సమయంలో కన్య రాశి కుటుంబ జీవితం ఆనందంగా, ప్రశాంతంగా మారుతుంది. ఆరోగ్య సమస్యలన్నీ తగ్గి, కెరీరలో స్థిరపడే అవకాశం ఉంది.కొన్ని నెలలు గా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాల్లోనూ ఆదాయం పెరుగుతుంది. చాలా తర్వాత లాభాలు చూస్తారు.
telugu astrology
2.వృషభ రాశి..
వృషభ రాశి వారికి కూడా ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది.ఆర్థికంగా బాగా కలిసొస్తుంది.ఆర్థికంగా ఊహించని అవకాశాలు వస్తూ ఉంటాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఉన్న ప్రతి చిన్న సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. వ్యాపార వృద్ధి, ఆదాయం పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది.
telugu astrology
3.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారికి చంద్రుడు కన్య రాశిలోకి ప్రవేశించడం అనేక ప్రయోజనాలను ఇస్తుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు, ఉద్యోగులకి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు చూస్తారు. దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది. ఇలా అన్ని రంగాల్లోనూ శుభఫలితాలు అందుకుంటారు.