వినాయక చవితి 2023: ఈ రాశుల వారిపై వినాయకుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.. వీరికి దేనికీ లోటుండదు
Ganesh Chaturthi 2023: వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ద్వాదశ రాశులు వారు వినాయకుడి ఆశీస్సలు ఎప్పుడూ పొందుతారు. ముఖ్యంగా 4 రాశుల వారికి మాత్రమే ఆయన ప్రత్యేక అనుగ్రహం ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మరి దీనిలో మీ రాశి ఉందా?
vinayaka chaturthi
హిందూ మత విశ్వాసాల ప్రకారం.. ఏ శుభకార్యమైనా సరే ముందుగా వినాయకుడినే పూజిస్తారు. ఈయన ఆశీస్సులు ఉంటే ఎంతటి పనైనా ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తవుతుందని నమ్మకం చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే వినాయకుడు విఘ్నాలను తొలగించే భగవంతుడు. పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడి ఆశీస్సులు ఉంటే జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. అలాగే సంపద, ఆదాయం, ఆరోగ్యం పెరుగుతాయని నమ్ముతారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. వినాయకుడి అనుగ్రహం కొన్ని రాశుల వారిపై ఎప్పుడూ ఉంటుంది. అలాగే వారి కష్టాలను తొలగిస్తాడు. విఘ్నేషుడి ఆశీస్సులతో వీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక సమస్యలు కూడా ఉండవు. మరి వినాయకుడికి ఇష్టమైన రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తెలుగు క్యాలెండర్ ప్రకారం.. సెప్టెంబర్ 18 అంటే ఈ రోజు వినాయక చవితి. చతుర్థి తిథి ఈ రోజు మధ్యాహ్నం 12:39 గంటలకు ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 19 మంగళవారం రాత్రి 8:43 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో వినాయకుడిని పూజిస్తారు. ఉదయం 11:01 గంటల నుంచి మధ్యాహ్నం 1:28 గంటల వరకు వినాయకుడిని పూజించడానికి మంచి సమయమని పండితులు చెబుతున్నారు. అయితే ఈరోజున పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదు.
Aries
మేష రాశి
ఈ రాశుల వారిని కుజుడు పాలిస్తాడు. కాగా ఈ రాశివారిపై బొజ్జ గణపయ్య ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అందుకే మేష రాశి వారు ఎంతో ధైర్యవంతులు. దేనినైనా ధైర్యంతో ఎదుర్కొంటారు. వీళ్ల తెలివితేటలు, నైపుణ్యంతో అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. అంతేకాదు వీరి తెలివికీ అందరూ ఫిదా అవుతారు. విఘ్నేషుడి ఆశీస్సులతో ఎలాంటి పనిలోనైనా వీరు విజయం సాధిస్తారు. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఇక ఉద్యోగుల వేతనాలు పెరుగుతాయి. బదిలీలు, పదోన్నతులు ఎక్కువగా ఉంటాయి. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో అనుకున్నది సాధిస్తారు.
Gemini
మిథునం
ఈ రాశివారిని బుధుడు పాలిస్తాడు. మిథున రాశి వారిపై కూడా వినాయకుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. అయితే మీ జాతకంలో బుధుడి స్థానం బలహీనంగా ఉంటే మీరు విఘ్నేషుడిని పూజించాలి. గణపతి ఆశీస్సులతో మీరు సమాజంలో మంచి గౌరవం పొందుతారు. అలాగే శ్రమకు తగ్గ ఫలితాలను పొందుతారు. మీ ఆదాయం కూడా బాగా పెరుగుతుంది.
Virgo
కన్య రాశి
ఈ రాశి వారిపై కూడా వినాయకుడి అనుగ్రహం ఉంటుంది. అందుకే వీళ్లు అన్ని రంగాల్లో రాణిస్తారు. ఈ రాశివారిని బుధుడు పరిపాలిస్తాడు. కాబట్టి వీళ్లు ఎంతో తెలివైన వారు. విద్య, వ్యాపార రంగాల్లో వీరు ముందుటారు. వీళ్లు ఒక గొప్ప స్థాయిలో ఉంటారు.
Capricorn
మకర రాశి
ఈ రాశికి శని అధిపతి. అందుకే వీరికి కష్టపడే వైకరి ఎక్కువగా ఉంటుంది. వినాయకుని ఆశీస్సులతో వీళ్లు మంచి విజయం సాధిస్తారు. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఎంతటి కష్టం వచ్చినా ప్రతి సమస్యను పరిష్కరిస్తారు. వీళ్లు విఘ్నేషుడి ఆశీస్సులతో విద్యా, వ్యాపార రంగాల్లో రాణిస్తారు.