Zodiac Signs: నేటి నుంచి ఈ 4 రాశులవారి తలరాత మారిపోతుంది, అదృష్టం, ధనవర్షం
విజయదశమి రోజు నుంచి నాలుగు రాశుల (Zodiac signs) వారికి బీభత్సంగా కలిసి వస్తుంది. తులారాశిలో అరుదైన బుధ కుజ గ్రహాల కలయిక వల్ల 50 ఏళ్ల తర్వాత ఒక అదృష్ట కాలం రాబోతోంది. దీని వల్ల నాలుగు రాశుల వారి కష్టాలు తీరిపోతాయి.

దసరా నుంచి
విజయదశమి తర్వాత కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి రానుంది. వారి కష్టాలు తీరిపోనున్నాయి. జ్యోతిష్యపరంగా దసరా పండుగ చాలా ముఖ్యమైనది. నేడు తులారాశిలో బుధ, కుజ గ్రహాల అరుదైన కలయిక జరగబోతోంది. దీని వల్ల 50 ఏళ్లకు ఒకసారి ఏర్పడే అద్భుతమైనకాలం రాబోతోంది. ఈ రెండు గ్రహాల కలయిక తులారాశిలో జరగడం వల్ల డబ్బు, సంబంధాలపై ప్రభావం పడుతుంది. దసరా రోజున సరస్వతి పూజ, ఆయుధ పూజ చేయడం అదృష్టాన్ని మరింత పెంచుతుంది.
మేష రాశి
మేష రాశి వారికి అంతా మంచే జరిగే కాలం ఇది. ఈ రోజు నుంచి వారికి తిరుగులేదు. ఈ గ్రహ కలయిక ఈ రాశివారి 7వ ఇంట్లో జరగుతుంది. దీని వల్ల వృత్తి ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. ఆకస్మికంగా ధనలాభాలు వచ్చే సూచనలు ఉంటాయి. పదోన్నతి, వ్యాపారాల్లో విజయం దక్కుతుంది. వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఇది మంచి కాలం. వారికి ఈ ఏడాది ఆర్థిక స్థిరత్వం, విజయం వంటివి దక్కుతాయి. బుధ-కుజ గ్రహాల కలయిక వారికి విపరీతమైన ధనయోగాన్ని కలిగిస్తుంది. అప్పుల నుంచి విముక్తి పొందుతారు. పెట్టిన పెట్టుబడులపై లాభాలు కూడా వస్తాయి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ కలయిక నాలుగవ ఇంట్లో జరుగుతుంది. దీని వల్ల భౌతిక జీవితంలో పురోగతి ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది. ఆస్తి సమస్యలు తీరిపోతాయి. కొత్త ఇల్లు లేదా వాహనం కొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఇది అద్భుతమైన కాలం. ఈ గ్రహాల కలయిక 11వ ఇంట్లో జరుగుతుంది. ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. వీరికి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. స్టాక్ మార్కెట్‌లో అదృష్టం కలిసొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.