Ekadashi:యోగ నిద్ర నుంచి మేల్కుంటున్న విష్ణుమూర్తి... ఈ 7 రాశుల జీవితం స్వర్ణమయం..!
Ekadashi: నాలుగు నెలల చాతుర్మాసం తర్వాత, నవంబర్ 1న విష్ణువు తన యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు. అందుకే, దీనిని దేవుత్తాన ఏకాదశి అంటారు. ఈ రోజు నుంచి కొన్ని రాశుల అదృష్ట సమయం ప్రారంభమౌతుం

ఏకాదశి
జోతిష్య శాస్త్రం ప్రకారం దేవుత్తాన ఏకాదశి నవంబర్ 1వ తేదీన జరుపుకుంటారు. ఈ రోజున, విష్ణువు, లక్ష్మీ దేవిని భక్తితో పూజిస్తారు. ఈ ఏడాది దేవుత్థాన ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే, ఈ రోజున ఓ ప్రత్యేక యోగం ఏర్పడుతుంది. ఈ రోజున రవి యోగం, మహాపురుష రాజయోగం కలయిక ఏర్పడుతుంది. ఈ ఏకాదశి రోజున దాదాపు 142 రోజుల తర్వాత విష్ణు మూర్తి యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు. ఆయన నిద్ర మేల్కుంటూనే కొన్ని రాశుల జీవితాలను స్వర్ణమయం చేయనున్నాడు. మరి, ఆ రాశులేంటో చూద్దాం....
1.మేష రాశి...
మేష రాశివారికి ఈ దేవుత్తాన ఏకాదశి రోజున విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. ఆర్థికంగా ఈ రాశివారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఆకస్మిక సంపద వచ్చే అవకాశం ఉంటుంది. విష్ణుమూర్తి అనుగ్రహంతో, ఈ రాశుల వారి జీవితాలు చాలా ఆనందంగా మారతాయి. కోరుకున్నవన్నీ జరుగుతాయి.
కర్కాటక రాశి...
కర్కాటక రాశిలో జన్మించిన వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కారణంగా, వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా, పనిలో ఉన్న ప్రతి ఒక్కరి నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక విషయాలకు సంబంధించి కర్కాటక రాశి వారు ఊహించని లాభాలు పొందుతారు. మీరు ఏదైనా కొత్త ప్రాజెక్టును ప్రారంభించాలి అనుకుంటే... ఇది చాలా అనువైన సమయం.
3.వృశ్చిక రాశి....
ఈ ఏకాదశి వృశ్చిక రాశివారికి అదృష్టాన్ని తెస్తుంది. ఈ కాలంలో, మీరు మీ కెరీర్ లో పురోగతిని సాధిస్తారు. గౌరవం, కీర్తి పొందే అవకాశం ఉంది. ఎక్కడ పెట్టుబడులు పెట్టినా లాభాలు వస్తాయి. ఈ సమయం ఈ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మునుపటి కంటే చాలా సంతోషంగా ఉంటారు.
4.కుంభ రాశి...
కుంభ రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో కుంభ రాశివారికి ప్రేమ విషయంలో విజయం సాధించగలరు. సమాజంలో ఎక్కువ గౌరవం, కీర్తి , ప్రతిష్టలు లభిస్తాయి. విష్ణువు దయ కారణంగా, కుంభ రాశి వారికి వారి వివాహ జీవితంలో మంచి సామరస్యం ఉంటుంది. అదనంగా, మీ జీవితంలో ప్రేమ పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కెరీర్ లో పురోగతి సాధించగలరు.
5.వృషభ రాశి...
ఈ ఏకాదశి రోజున వృషభ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక లాభం లేదా కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈ కాలంలో, మీ ఇంట్లో ఆనందం , శాంతితో పాటు, మీకు మంచి మానసిక సమతుల్యత కూడా ఉంటుంది. వ్యాపారం చేసే వృషభ రాశి వారికి ఈ కాలంలో విదేశాలకు ప్రయాణించే యోగం కూడా లభిస్తుంది. విజయాలు సాధించగలరు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
6.కన్య రాశి...
కన్య రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఏకాదశి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో, కన్య రాశిలో జన్మించిన వ్యక్తులు వారి వృత్తి , వ్యాపారంలో చాలా పురోగతి సాధించే అవకాశం ఉంది. అలాగే, మీరు పాత వివాదాలకు పరిష్కారం పొందుతారు. అందువలన, ఈ కాలంలో మానసిక శాంతిని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కన్య రాశిలో జన్మించిన వ్యక్తులకు వారి తోబుట్టువులతో సంబంధం గతంలో కంటే చాలా మెరుగుపడుతుంది. సంతోషం పెరుగుతుంది. కుటుంబ సమస్యలన్నీ పరిష్కారమౌతాయి.
7.మకర రాశి..
మకర రాశిలో జన్మించిన వారు ఏకాదశి నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఈ సమయంలో, మీ సన్నిహితులతో ఉన్న అన్ని విభేదాలు పరిష్కరించగలరు. అదేవిధంగా, కార్యాలయంలో మకర రాశిలో జన్మించిన వ్యక్తులు వారి అన్ని ప్రాజెక్టులలో విజయం సాధిస్తారు. ఈ కాలంలో, మకర రాశిలో జన్మించిన వ్యక్తులు వారి ప్రేమ జీవితంలో మంచి సామరస్యాన్ని కలిగి ఉంటారు. అదనంగా, మీరు స్నేహితులతో కలిసి మతపరమైన ప్రదేశానికి ప్రయాణించే అవకాశం కూడా పొందుతారు. ఈ సమయంలో మకర రాశిలో జన్మించిన వ్యక్తులు ఆరోగ్యం , ఆర్థిక విషయాలలో కూడా చాలా మెరుగుదల పొందుతారు.