Saturn Transit: శని గ్రహ గమనం వల్ల 116 రోజుల పాటూ ఈ 4 రాశుల వారికి తిరుగే ఉండదు
Saturn Transit:న్యాయదేవుడైన శని అక్టోబర్ 9న ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించి.. 2027 ఫిబ్రవరి 8 వరకు ఇదే నక్షత్రంలో సంచరిస్తారు. ఉత్తరాభాద్రపద నక్షత్రానికి అధిపతి శని దేవుడే. తన సొంత నక్షత్రంలోనే శని సంచారం వల్ల 4 రాశులవారికి కలిసివస్తుంది.

వృషభ రాశి
శని సంచారం వల్ల ఈ రాశి వారికి ఆదాయం విషయంలో కొత్త మార్గాలు ఏర్పడతాయి. ఇక వ్యాపారం చేస్తున్న వారికి కలిసొచ్చే సమయం ఇది. వ్యాపార స్థితి బలపడుతుంది. ఇక ఉద్యోగం చేస్తున్నవారికి పురోగతి కనిపిస్తుంది. ఈ రాశివారిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఈ రాశివారికి అదృష్టం కలిసివస్తుంది.
మిథున రాశి
మిథునరాశికి మంచి రోజులు నడుస్తున్నాయి. శని దేవుడి వల్ల పెండింగ్లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఇక పనిచేసే చోట ఈ రాశి వారి నాయకత్వ సామర్థ్యాలు ప్రదర్శించే అవకాశం వస్తుంది. వీరిలో జీవితంలో ఆర్థిక సమస్యలు తగ్గి ప్రశాంతంగా ఉంటారు.
తులా రాశి
శని గ్రహం గమనం వల్ల తులా రాశి వారికి అంతా మంచే జరుగుతుంది. ఇక ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు పెరుగుతాయి. ఇక వ్యాపారపరంగా, వ్యక్తిగతంగా మంచి ఫలితాలు దక్కుతాయి. ఈ రాశివాకరికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.
మకర రాశి
మకర రాశికి చెందిన ఉద్యోగస్తులకు శని సంచారం బాగా కలిసివస్తుంది. వీరి జీతభత్యాలలో పెరుగుదల ఉంటుంది. అలాగే పదోన్నతి లభించే అవకాశం ఉంది. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి మంచి రాబడి వస్తుంది. వ్యాపారం విస్తరించడానికి అనుకూలమైన సమయం ఇదే.

