MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • Lord Shiva: శివుడు ఒంటికి రాసుకునే చితి బూడిద ఎవరి శరీరానిదో తెలుసా?

Lord Shiva: శివుడు ఒంటికి రాసుకునే చితి బూడిద ఎవరి శరీరానిదో తెలుసా?

Lord Shiva: మహాశివరాత్రి నాడు భక్తులు శివుని ప్రత్యేక ఆశీస్సుల కోసం పూజలు చేస్తారు. శివుడికి ఇష్టమైనవన్నీ సమర్పిస్తారు. అయితే శివుడు స్మశానంలోని బూడిదను శరీరంపై ఎందుకు పూసుకుంటారో ఎప్పుడైనా ఆలోచించారా? 

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 15 2026, 01:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బూడిద రాసుకునే శివుడు
Image Credit : Getty

బూడిద రాసుకునే శివుడు

మహాశివరాత్రి వచ్చేసింది. శివ భక్తులంతా తమ ఇష్టదైవాన్ని కొలిచేందుకు సిద్ధమవుతారు. ఇదే శివుని ఆశీస్సులు పొందే సమయం. వేద జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న ప్రకారం మహాశివరాత్రి నాడు అనేక శుభకరమైన సంయోగాలు జరుగుతాయి. అందుకే మహాశివరాత్రిని శివ భక్తుల శుభప్రదంగా భావిస్తారు. శివుని రూపం ఇతర దేవతలతో పోలిస్తే ఎంతో భిన్నంగా ఉంటుంది. దేవతలంతా ధగధగ మెరిసే నగలు, పట్టు వస్త్రాలతో కనిపిస్తారు. మహాదేవుడు మాత్రం బూడిద రాసుకుని కనిపిస్తాడు. స్మశానంలోని బూడిదను ఆయన తన శరీరానికి ఎందుకు పూసుకుంటాడో ఎప్పుడైనా ఆలోచించారా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బూడిద చెబుతున్నదిదే
Image Credit : Getty

బూడిద చెబుతున్నదిదే

మత గ్రంథాలు చెబుతున్న ప్రకారం బూడిద అనేది త్యాగాన్ని సూచిస్తుంది. శివుడు భూమిపై పరిస్థితులు చేజారినప్పుడు వినాశకరంగా మారతారు. భూమికి చేటు తీసుకొచ్చే వారిని నాశనం చేస్తాడు. శివుని శరీరంపై ఉన్న బూడిద.. చివరికి ప్రతిదీ బూడిగానే మారుతుందని చెప్పడమే దీని సంకేతం. తన శరీరానికి బూడిద రాసుకోవడం ద్వారా తన భక్తులకు సర్వసుఖాలు, శారీరక సౌందర్యం అన్ని తాత్కాలికమేనని శివుడు చెబుతున్నట్టే. ఆత్మ, సత్యం, మరణం.. ఇవే చివరికి అంతిమ నిజాలు అని ఆయన వివరిస్తున్నట్టే.

Related Articles

Related image1
Gadida Guddu: గాడిద గుడ్డు పదం వెనుక ఉన్న అసలు కథ ఇదే
Related image2
Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు నటులు ఒక్కో ఎపిసోడ్‌కు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలుసా?
34
సొంత భార్య బూడిద
Image Credit : Getty

సొంత భార్య బూడిద

దీనికి సంబంధించి ఒక పౌరాణిక కథ కూడా ఉంది. శివుని భార్య అయిన సతీదేవి ఒక యజ్ఞంలో తనను తాను దహనం చేసుకుంటుంది. ఆమె లేక శివుడు విరహాగ్నితో విలవిలలాడిపోతాడు. ఆమె మృతదేహంతో విశ్వమంతా నాట్యం చేస్తాడు. విష్ణువు భూచక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తాడు. ఆమె బూడిద మాత్రమే శివుడి చేతుల్లో మిగిలిపోతుంది. ఆమె జ్ఞాపకార్థం ఆ బూడిదని తన శరీరానికి పూసుకుంటాడు శివుడు. బూడిద శరీరానికి రాయడం వెనక శాస్త్రీయ కారణం కూడా ఉంది. తీవ్రమైన చలి, వేడి నుంచి బూడిద శరీరాన్ని కాపాడుతుందని నమ్ముతారు. అందుకే యోగులు, సన్యాసులు కూడదా శరీరానికి బూడిద రాసుకుంటూ ఉంటారు.

44
విషప్రభావాన్ని తగ్గించేందుకు
Image Credit : Getty

విషప్రభావాన్ని తగ్గించేందుకు

కేవలం బూడిద మాత్రమే కాదు శివుడికి సమర్పించే కొన్ని నైవేద్యాలు కూడా చేదుగా ఉంటాయి. సముద్రమథనం సమయంలో విషం ఉద్భవించినప్పుడు ఈ ప్రపంచాన్ని రక్షించడానికి శివుడు దాన్ని తాగి తన గొంతులోనే దాచుకుంటాడు. ఆ విషం వల్ల కలిగే వేడి శివుడి మెదడుకు, శరీరానికి చేరి కాలిపోతాయి. ఆ మెదడును చల్లబరచడానికి దేవతలు అతనికి నీరు, గంజాయి, మారేడు పత్రాలు, ఉమ్మెత్త పువ్వులు వంటి ఔషధ మూలికలను అర్పిస్తారు. అప్పటి నుంచి అవి శివుడికి ప్రియమైనవిగా మారిపోయాయని చెప్పుకుంటారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
పండుగలు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Raksha Bandhan 2026: రాఖీ పండగనాడు 3 మహా యోగాలు.. ఈ 5 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!
Recommended image2
Saubhagya Yoga: సౌభాగ్య యోగంతో సెప్టెంబర్‌లో ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే!
Recommended image3
Guru Gamanam: కేతు నక్షత్రంలోకి గురు గమనం.. ఈ రాశులకు కుబేర యోగం, డబ్బే డబ్బు..!
Related Stories
Recommended image1
Gadida Guddu: గాడిద గుడ్డు పదం వెనుక ఉన్న అసలు కథ ఇదే
Recommended image2
Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు నటులు ఒక్కో ఎపిసోడ్‌కు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved