Today Rasi Phalalu: ఈ రాశుల వారికి ఎప్పటినుంచో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి..!
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 15.03.2025 శనివారానికి సంబంధించినవి.

మేష రాశి ఫలాలు
మేష రాశి ఫలాలు
ముఖ్యమైన విషయాల్లో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో తెలివిగా ముందుకు సాగుతారు. అవసరానికి డబ్బు అందుతుంది. వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది.

వృషభ రాశి ఫలాలు
వృషభ రాశి ఫలాలు
ఎప్పటినుంచో ఉన్న సమస్యలు తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు అనుకూలం. విలువైన వస్తువులు కొంటారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభదాయకం.

మిథున రాశి ఫలాలు
మిథున రాశి ఫలాలు
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారాల్లో నిరాశ ఎదురవుతుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు ఉంటాయి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్త సమస్యలు వస్తాయి. పనులు సకాలంలో పూర్తి కావు.

కర్కాటక రాశి ఫలాలు
కర్కాటక రాశి ఫలాలు
దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయినవారితో చిన్నపాటి వివాదాలు వస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. స్థిరత్వం లేని ఆలోచనలతో నష్టాలు వస్తాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అననుకూలం.

సింహ రాశి ఫలాలు
సింహ రాశి ఫలాలు
పిల్లల చదువు విషయాల్లో శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా అనుకూలం. కొత్త వ్యాపారాలకు పెట్టుబడి సాయం అందుతుంది.

కన్య రాశి ఫలాలు
కన్య రాశి ఫలాలు
వాహనయోగం ఉంది. ఉద్యోగంలో ప్రశంసలు పొందుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు అనుకూలం. ఆర్థికంగా కలిసివస్తుంది. శుభవార్తలు వింటారు.

తులా రాశి ఫలాలు
తులా రాశి ఫలాలు
ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి. వృథా ఖర్చులు ఎక్కువ. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రమే. ఉద్యోగంలో ఉన్నతాధికారుల కోపానికి గురికావల్సి వస్తుంది. చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు వస్తాయి.

వృశ్చిక రాశి ఫలాలు
వృశ్చిక రాశి ఫలాలు
వ్యాపారంలో వివాదాలు తొలగిపోతాయి. ముఖ్యమైన పనుల్లో తొందరపాటు వల్ల పనులు పూర్తికావు. వృత్తి, ఉద్యోగాల్లో చిన్నపాటి సమస్యలు వస్తాయి. బంధువుల నుంచి ఊహించని ఒత్తిడి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

ధనుస్సు రాశి ఫలాలు
ధనుస్సు రాశి ఫలాలు
ఆశ్చర్యకరమైన సమాచారం వింటారు. చాలకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు సాధారణం. ఉద్యోగంలో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. కొత్త పరిచయాలు పెరుగుతాయి.

మకర రాశి ఫలాలు
మకర రాశి ఫలాలు
ఆదాయం అంతంత మాత్రమే. ఉద్యోగంలో ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వస్తాయి. దైవభక్తి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కష్టానికి తగ్గ ఫలితం దక్కదు. పనులు సకాలంలో పూర్తికాక చికాకు వస్తుంది.

కుంభ రాశి ఫలాలు
కుంభ రాశి ఫలాలు
ఆర్థికంగా అనుకూలం. వృత్తి, ఉద్యోగాలు అనుకూలం. కొత్త పనులు ప్రారంభిస్తారు. విలువైన వస్తువులు కొంటారు. నిరుద్యోగులకు అనుకూలం. శుభకార్యాల్లో పాల్గొంటారు.

మీన రాశి ఫలాలు
మీన రాశి ఫలాలు
బంధువుల నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది. అతికష్టం మీద పనులు పూర్తవుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు కలసిరాదు. కొన్ని విషయాల్లో బాగా ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది.

