నేడు ఓ రాశివారు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది!
ఈ రాశి ఫలాలు 7.09.2025 ఆదివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ఆర్థికంగా స్థిరత్వం ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు మందగిస్తాయి.
వృషభ రాశి ఫలాలు
సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. దూరప్రాంత బంధు మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపార భాగస్వాములతో సమస్యలు సర్దుమణుగుతాయి.
మిథున రాశి ఫలాలు
అవసరానికి చేతిలో డబ్బు ఉండదు. కొన్ని పనుల్లో కష్టానికి తగిన ఫలితం ఉండదు. కొన్ని వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాతో ముందుకు సాగడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు ఉంటాయి. ఉద్యోగం విషయంలో తొందరపాటు మంచిది కాదు.
కర్కాటక రాశి ఫలాలు
ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు కలిసివస్తాయి. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
సింహ రాశి ఫలాలు
ముఖ్యమైన పనులు శ్రమతో కానీ పూర్తికావు. ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్య రాశి ఫలాలు
ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో ఉన్నత హోదాలు పొందుతారు. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నా.. సకాలంలో పూర్తిచేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
తుల రాశి ఫలాలు
వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. ఆర్థికంగా అనుకూలం.
వృశ్చిక రాశి ఫలాలు
కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్థికంగా ఒడిదుడుకులు ఉంటాయి. పనులు సకాలంలో పూర్తి కావు.
ధనుస్సు రాశి ఫలాలు
ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. అకారణంగా ఇతరులతో వివాదాలు కలుగుతాయి. అప్పుల సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. పిల్లల చదువుపై దృష్టి సారించడం మంచిది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి.
మకర రాశి ఫలాలు
కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సహాయం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాల్లో పనిభారం నుంచి ఉపశమనం పొందుతారు. సామజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
కుంభ రాశి ఫలాలు
సంతాన ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు సర్దుమణుగుతాయి. విద్యార్థులు పరీక్షలలో ఉతీర్ణత సాధిస్తారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.
మీన రాశి ఫలాలు
ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారాల్లో ఒత్తిడి తప్పదు. కుటుంబ పెద్దల సలహాతో కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు కొంత అనుకూలంగా సాగుతాయి.