Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 07.10.2026 బుధవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. పాత అప్పులు తీర్చగలుగుతారు.
వృషభ రాశి ఫలాలు
చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటా బయటా గందరగోళ పరిస్థితులుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
మిథున రాశి ఫలాలు
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు శ్రమతో కానీ పూర్తికావు. అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. బంధువులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు శ్రమ తప్పదు.
కర్కాటక రాశి ఫలాలు
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. సోదరుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.
సింహ రాశి ఫలాలు
కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
కన్య రాశి ఫలాలు
భూ వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. బంధు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.
తుల రాశి ఫలాలు
చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కలిసిరావు. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
వృశ్చిక రాశి ఫలాలు
వృత్తి, ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సన్నిహితుల నుంచి శుభాకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
ధనుస్సు రాశి ఫలాలు
సంతనానికి విద్య, ఉద్యోగ అవకాశాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మిత్రులతో విందు వినోదాలకు హాజరువుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది.
మకర రాశి ఫలాలు
కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం దక్కదు. ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు. దూర ప్రయాణాల వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.
కుంభ రాశి ఫలాలు
చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. నూతన రుణ యత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
మీన రాశి ఫలాలు
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇతరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

