- Home
- Astrology
- Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి విపరీతంగా కలిసివస్తుంది.. అదృష్టం మొత్తం వీరిదే!
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి విపరీతంగా కలిసివస్తుంది.. అదృష్టం మొత్తం వీరిదే!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 05.11.2026 గురువారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అధికారులను సైతం మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలలో విశేషమైన లాభాలు అందుతాయి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.
వృషభ రాశి ఫలాలు
దూర ప్రయాణాల్లో అవరోధాలు కలుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
మిథున రాశి ఫలాలు
ఆర్ధికంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆప్తుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి.
కర్కాటక రాశి ఫలాలు
సన్నిహితులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చే విధంగా ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. స్థిరాస్తి ఒప్పందాలు అంతగా కలిసిరావు.
సింహ రాశి ఫలాలు
వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు పని భారం వల్ల తగిన విశ్రాంతి ఉండదు.
కన్య రాశి ఫలాలు
బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఊహించని ట్రాన్స్ ఫర్ లు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి.
తుల రాశి ఫలాలు
ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. ఇంటా బయటా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఒక వ్యవహారంలో జీవిత భాగస్వామితో వివాదాలు కలుగుతాయి. విద్యార్థుల పరీక్ష ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. అవసరానికి చేతిలో డబ్బు ఉండదు.
వృశ్చిక రాశి ఫలాలు
ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చేపట్టిన పనుల్లో అవరోధాలు తొలగుతాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.
ధనుస్సు రాశి ఫలాలు
కుటుంబ పెద్దల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. సంతాన ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు.
మకర రాశి ఫలాలు
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. తల్లితరపు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బందిపడతారు.
కుంభ రాశి ఫలాలు
ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల గురించి చర్చిస్తారు. వృత్తి, ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు సన్నిహితుల సహాయంతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు.
మీన రాశి ఫలాలు
ఉద్యోగాలలో అధికారులతో వాదనలకు వెళ్లకపోవడం మంచిది. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సమస్యాత్మకంగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కొన్ని వ్యవహారాల్లో ఇతరుల నుంచి వ్యతిరేకత తప్పదు.





