Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి జీవిత భాగస్వామి సూచనలు మంచి ఫలితాలు ఇస్తాయి!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 7.12.2025 ఆదివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు. మాటల్లో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. చేపట్టిన పనుల్లో శ్రమ తప్పదు. స్థిరాస్తి విషయాల్లో పెద్దలతో తగాదాలు జరిగే అవకాశం ఉంది.
వృషభ రాశి ఫలాలు
సోదరులతో ఉన్న మనస్పర్థలు తొలగి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారాలలో కొత్త నిర్ణయాలు లాభాన్నిస్తాయి. ముఖ్యమైన పనుల్లో మీ ఆలోచనలు కలిసివస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఇంట్లో సంతోషం నెలకొంటుంది.
మిథున రాశి ఫలాలు
కొత్త వ్యాపారాల్లో స్వల్ప లాభాలుంటాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. ఉద్యోగులు అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కంటి సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు గంధరగోళంగా ఉంటాయి.
కర్కాటక రాశి ఫలాలు
సంతాన విద్య, ఉద్యోగ విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలు సాధారణం. సమాజంలో గౌరవం పెరుగుతుంది. చేపట్టిన పనులు సాఫీగా సాగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. దూర ప్రాంత బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది.
సింహ రాశి ఫలాలు
ఖర్చులు పెరుగుతాయి. రుణ దాతల నుంచి ఒత్తిడి పెరగవచ్చు. కడుపు సంబంధ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. చేపట్టిన పనుల్లో ఆలస్యం జరుగుతుంది. వ్యాపారంలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగాల్లో వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం.
కన్య రాశి ఫలాలు
సంతాన విద్య, ఉద్యోగాలు, వివాహ విషయాలు అనుకూలంగా సాగుతాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు రావచ్చు. ముఖ్యమైన పనులు బంధుమిత్రుల సహకారంతో సఫలమవుతాయి.
తుల రాశి ఫలాలు
వృత్తి, ఉద్యోగాలు అనుకూలం. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువులతో చిన్నపాటి వివాదాలు ఉన్నా పెద్దగా ప్రభావం ఉండదు. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలకు ఫలితం కనిపించకపోవచ్చు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు మధ్యలో ఆగిపోవడం వల్ల చిరాకుగా అనిపిస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయాల్లో జాగ్రత్త అవసరం.
ధనుస్సు రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాల్లో గంధరగోళ పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. కొన్ని విషయాలు సమస్యాత్మకంగా మారే అవకాశం ఉంది. వృథా ఖర్చులు పెరుగుతాయి.
మకర రాశి ఫలాలు
ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సూచనలు మంచి ఫలితాలు ఇస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
కుంభ రాశి ఫలాలు
బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలు సాధారణం. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక వ్యవహాారాలు అనుకున్న విధంగా సాగుతాయి. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీన రాశి ఫలాలు
కొత్త వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. దూర ప్రాంత బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలు అనుకూలం. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. వ్యాపారాలు లాభదాయకం.

