MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అవకాశం దక్కుతుంది!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అవకాశం దక్కుతుంది!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 06.04.2026 సోమవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

2 Min read
Author : Kavitha G
Published : Apr 06 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. బంధు మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. సమాజంలో పెద్దల అనుగ్రహంతో కీలకమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. కీలక విషయాలలో ఆలోచించి ముందుకు సాగాలి. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు మానసికంగా కొంత చికాకు కలిగిస్తాయి.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. శ్రమకు తగిన ఫలితం ఉండదు. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు కలుగుతాయి. తల్లి తరపు బంధు మిత్రులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నష్ట సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

కంటి సంబంధిత సమస్యలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు ఉంటాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మొండి బాకీలు తీర్చగలుగుతారు. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో నూతన పెట్టుబడులు లభిస్తాయి.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. కీలక వ్యవహారాలలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో పై అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. సంతాన ఆరోగ్యం విషయంలో శ్రద్ద వహించాలి. ఇంటా బయటా సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కొన్ని పనులు అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

దైవ సేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్దల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలు అనుకూలం. మొండి బాకీలు సకాలంలో వసూలవుతాయి. బంధు మిత్రులతో సంతాన వివాహ విషయం గురించి చర్చిస్తారు. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

బంధు మిత్రుల నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది. దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. వృత్తి, వ్యాపారాలలో ఆర్థిక సమస్యలు కలుగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

వ్యాపారాలలో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు డబ్బు విషయంలో అదృష్టవంతులు.. విపరీతంగా సంపాదిస్తారు!
Recommended image3
Second Marriage: ఈ 4 రాశుల వారికి రెండో పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే...
Related Stories
Recommended image1
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారు ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి!
Recommended image2
Planetary Transits: 5 గ్రహాల సంచారం, 3 రాజయోగాలు.. ఈ 4 రాశులవారికి డబ్బే డబ్బు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved