Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 30.07.2026 గురువారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. నూతన వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.
వృషభ రాశి ఫలాలు
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. బంధువులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలలో కొన్ని నిర్ణయాలు నష్టాలు కలిగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం తప్పదు. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది.
మిథున రాశి ఫలాలు
కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
కర్కాటక రాశి ఫలాలు
సన్నిహితుల నుంచి ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. ఇంటా బయటా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
సింహ రాశి ఫలాలు
ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన డబ్బు సహాయం అందుతుంది. సోదరులతో కుటుంబ విషయాల గురించి చర్చిస్తారు. దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాలో బాటలో సాగుతాయి.
కన్య రాశి ఫలాలు
రావాల్సిన సొమ్ము సకాలంలో వసూలవుతుంది. ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సొంత నిర్ణయాలు కలిసివస్తాయి. ఉద్యోగులకు ప్రశంసలు దక్కుతాయి.
తుల రాశి ఫలాలు
పాత రుణాలు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. నిరుద్యోగ యత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగుల కష్టానికి తగిన ఫలితం దక్కదు.
వృశ్చిక రాశి ఫలాలు
చేపట్టిన పనులు శ్రమతో కానీ పూర్తి కావు. కొన్ని విషయాలలో సోదరులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. భూ సంబంధిత వివాదాలు కొంత ఒత్తిడి కలిగిస్తాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఉద్యోగాలలో ఒత్తిడి తప్పదు.
ధనుస్సు రాశి ఫలాలు
సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.
మకర రాశి ఫలాలు
సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. రాజకీయ ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. స్థిరాస్తి వ్యవహారాలు లాభదాయకం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు.
కుంభ రాశి ఫలాలు
ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ప్రయాణాలలో అవరోదాలు కలుగుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. శారీరక మానసిక సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకు తప్పదు.
మీన రాశి ఫలాలు
కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

