MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయం చేస్తారు!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయం చేస్తారు!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 03.07.2026 శుక్రవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Jul 03 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI Meta

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

ఉద్యోగాలలో ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆదాయం తగినంత ఉండదు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.

Related Articles

Related image1
Dream Astrology: కలలో బాగా ఏడుస్తున్నట్లు లేదా నవ్వుతున్నట్లు కనిపిస్తే అర్థం ఏంటో తెలుసా?
Related image2
July Horoscope: ఈ నెలలో ఓ రాశివారు స్త్రీ సంబంధిత వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక చికాకు పెరుగుతుంది. ఆర్ధిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన వ్యాపారాలలో ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

సన్నిహితుల నుంచి నూతన విషయాలు తెలుసుకుంటారు. బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. స్త్రీ సంబంధ వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

మొండి బాకీలు వసూలవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మంచి పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. దైవ సేవా కార్యక్రమాలకు డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపార విస్తరణకు అవరోధాలు కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత అనుకూలంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఇతరులకు డబ్బు పరంగా మాట ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు ఉంటాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ తగ్గుతుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అప్రమత్తంగా ఉండాలి.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృథా ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకూలించవు. నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన డబ్బు సహాయం అందుతుంది. నిరుద్యోగులు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరించి లాభాలు అందుకుంటారు.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు చికాకు పరుస్తాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు అధిగమిస్తారు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలు కొంత అనుకూలంగా సాగుతాయి. రాజకీయ ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి అవసరానికి డబ్బు సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమ తప్పదు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. దూర ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు అమలు చేస్తారు. ఉద్యోగాలలో తోటివారితో వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్ధిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు అవసరానికి చేతికి డబ్బు అందక ఇబ్బంది పడతారు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆశించిన పదవులు.. ఆప్తుల నుంచి శుభవార్తలు!
Related Stories
Recommended image1
Dream Astrology: కలలో బాగా ఏడుస్తున్నట్లు లేదా నవ్వుతున్నట్లు కనిపిస్తే అర్థం ఏంటో తెలుసా?
Recommended image2
July Horoscope: ఈ నెలలో ఓ రాశివారు స్త్రీ సంబంధిత వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved