MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నదమ్ములతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నదమ్ములతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 03.08.2026 సోమవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Aug 03 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

అనుకున్న పనులు ముందుకు సాగవు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొన్ని విషయాలలో బంధు మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు సతమతం చేస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

Related Articles

Related image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి మేలు జరుగుతుందంటే?
Related image2
August Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. ఈ నెల ఎవరికి అదృష్టం? ఎవరికి ప్రతికూలం?
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. సోదరుల నుంచి డబ్బు సహాయం అందుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలం.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వాహన యోగం ఉంది. చేపట్టిన పనులలో అవాంతరాలు అధిగమిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. దూరపు బంధువుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇంటా బయటా సమస్యలు బాధిస్తాయి. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలు అంతంతమాత్రంగా ఉంటాయి.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

చేపట్టిన పనులలో శ్రమ అధికమవుతుంది. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగులు కష్టపడ్డా ఫలితం ఉండదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త సమస్యలు ఎదురవుతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పని చేసి అధికారుల అనుగ్రహం పొందుతారు.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

కీలక వ్యవహారాలు మందగిస్తాయి. ఇంటా బయటా ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. అన్నదమ్ములతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. నూతన రుణ యత్నాలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

అనుకున్న పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ప్రభుత్వ అధికారులతో చర్చలు సఫలమవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో కీలక మార్పులు ఉంటాయి.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. సంతాన విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. నూతన రుణ యత్నాలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఉంటాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి మేలు జరుగుతుందంటే?
Related Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి మేలు జరుగుతుందంటే?
Recommended image2
August Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. ఈ నెల ఎవరికి అదృష్టం? ఎవరికి ప్రతికూలం?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved