MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Astrology
  • August Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. ఈ నెల ఎవరికి అదృష్టం? ఎవరికి ప్రతికూలం?

August Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. ఈ నెల ఎవరికి అదృష్టం? ఎవరికి ప్రతికూలం?

August Horoscope: ఈ మాస ఫలాలు ఆగస్టు నెలకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల మాస ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

4 Min read
Author : Kavitha G
Published : Aug 01 2026, 10:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
మాస ఫలాలు
Image Credit : Getty

మాస ఫలాలు

ఈ మాస ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ నెల ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

మేష రాశి వారికి ఆగస్టు నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రమ అధికమవుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు సహాయం లభిస్తుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. సంతాన వివాహ విషయంలో శుభవార్తలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. నిరుద్యోగులకు చిన్నపాటి కష్టంతో నూతన అవకాశాలు లభిస్తాయి.

313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

వృషభ రాశి వారికి ఈ మాసం ప్రారంభంలో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన అన్ని వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు పొందుతారు. మాసం మధ్యనుంచి దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో చీటికిమాటికి వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. గృహ నిర్మాణ యత్నాలలో ఊహించని అవరోధాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

మిథున రాశివారికి ఈ మాసం మరింత అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుంది. కొన్ని సమస్యలను స్నేహితుల చొరవతో పరిష్కరించుకుంటారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. స్త్రీ సంబంధిత వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సంతానం విద్యా విషయాలలో పురోగతి కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలను అధికారుల సహాయంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో సొంత నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. నెలాఖరులో జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

కర్కాటక రాశివారికి ఈ నెల అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అన్ని వైపుల నుంచి ఆదాయం అందుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న పదవులు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. విద్యార్థుల విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

సింహ రాశివారికి ఈ మాసం అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఎంతటి వారినైనా మీ మాట మీదకి తీసుకొస్తారు. శత్రు పరమైన సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ముందుకు సాగుతారు. సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సంతానం ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగులకు కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

కన్య రాశి వారికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మాసం ప్రథమ భాగంలో చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. కొన్ని వ్యవహారాలలో బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది. మాసం మధ్య నుంచి పరిస్థితులు మెరుగుపడతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. విద్యార్థుల విదేశీ ప్రయాణ ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

తుల రాశివారికి ఈ నెల మరింత ప్రతికూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు పెరుగుతాయి. వాహన ప్రయాణాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలలో పెద్దల సలహాలతో ముందుకు సాగడం మంచిది. ఉద్యోగులకు పై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. కొన్ని విషయాలలో తొందరపాటు వల్ల ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపుల అవసరమవుతాయి. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

వృశ్చిక రాశివారికి ఈ మాసం మొదటి భాగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. చాలాకాలంగా పూర్తి కాని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. స్త్రీ సంబంధిత విషయాల్లో జాగ్రత్త అవసరం. ఆర్థిక వ్యవహారాలు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు సహాయం అందుతుంది. మాసం మధ్య నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. వాహన ప్రయాణ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ధనుస్సు రాశివారికి ఈ మాసం అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయం తగినంత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సంతానం విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. మాసం చివరన జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

ఈ మాసం మకర రాశివారికి మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు కలిగినప్పటికీ కొంత నిదానంగా పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సంతాన పరంగా శుభవార్తలు అందుకుంటారు. ప్రయాణ అనుకూలత కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో చివరి నిముషాల్లో నిర్ణయాల మార్పు వల్ల లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

కుంభ రాశి వారికి ఈ మాసం అంతగా అనుకూలంగా ఉండదు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు. వృత్తి, వ్యాపారాలు అంతగా రాణించవు. ఆర్థికంగా మరింత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. చుట్టుపక్కల వారితో ఊహించని వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. స్త్రీ సంబంధిత వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. గృహ నిర్మాణయత్నాలు వాయిదా వేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. నెల ఆఖరులో ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

మీన రాశివారికి ఈ మాసం అంతగా అనుకూలించదు. వృత్తి, వ్యాపారాలలో నిరాశ, నష్టం తప్పదు. ఆదాయపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. ఇంటా బయటా కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు. దైవ కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది. నెల ఆఖరులో కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధన లాభం.. నూతన వాహన యోగం!
Recommended image2
Dream Astrology: ఈ 3 రకాల కలలు వస్తే ఎవరికీ చెప్పకూడదట! ఎందుకో తెలుసా?
Recommended image3
Visha Yoga: అక్టోబర్ నెలాఖరులో శని, చంద్రుల సంయోగం.. ఈ 5 రాశులు డేంజర్ లో ఉన్నట్లే..!
Related Stories
Recommended image1
Mercury Transit: కర్కాటక రాశిలోకి బుధుడు.. ఈ 4 రాశులవారికి గుడ్ టైం స్టార్ట్!
Recommended image2
Ketu Transit: సింహ రాశిలో కేతు సంచారం.. ఈ 4 రాశులకు జాక్‌పాట్, ఊహించని ధనలాభం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved