MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: ఈ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి డబ్బు సహాయం చేస్తారు!

Today Rasi Phalalu: ఈ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి డబ్బు సహాయం చేస్తారు!

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 27.07.2025 ఆదివారానికి సంబంధించినవి.

2 Min read
Author : Kavitha G
Published : Jul 27 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

పనులు ముందుకు సాగవు. బంధువుల నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది. ప్రయాణాల్లో మార్పులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తికావు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లలకు విద్య, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

312
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

దూరప్రయాణాలు వాయిదా పడతాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో గొడవలకు దిగడం మంచిది కాదు. ముఖ్యమైన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఉంటాయి.

412
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

సోదరుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. 

512
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

బంధు మిత్రులతో సేవా కార్యక్రమాలు చేపడతారు. స్థిరాస్తి వివాదాలు పెద్దల సహాయంతో రాజీ చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగులు విలువైన పత్రాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

612
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కొన్ని విషయాలు ఆశ్చర్యపరుస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. నూతన వాహనయోగం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు.

712
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

ఇంటా బయట విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన వస్తులాభాలు పొందుతారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం నుంచి  ఉపశమనం పొందుతారు.

812
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. దూర ప్రయాణాల్లో అవరోధాలు కలుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు కొంతమందికి స్థాయిని పెంచుతాయి. ఉద్యోగాల్లో మీకు రావాల్సిన గుర్తింపు వేరే వారికి వస్తుంది.

912
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తప్పదు. దీర్ఘకాలిక రుణాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని పనుల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బంది తప్పదు. ఉద్యోగాల్లో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.

1012
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

స్థిరాస్తి ఒప్పందాలు అనుకూలిస్తాయి. బందు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. నూతన పరిచయాలు సంతోషాన్నిస్తాయి. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.

1112
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థతను చాటుకుంటారు. వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారి డబ్బు సహాయం చేస్తారు. చేపట్టిన పనులు చకచకా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

1212
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల కొంత చికాకు పెరుగుతుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. సన్నిహితులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
రాశి ఫలాలు
పండుగలు
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి సీక్రెట్ చెప్తే.. అందరికీ చెప్పేస్తారు జాగ్రత్త!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు.. అత్తను అమ్మలా చూసుకుంటారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved