MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 25.03.2026 బుధవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

2 Min read
Author : Kavitha G
Published : Mar 25 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. పాత మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల ద్వారా ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. ఇంటి వాతావరణం ఆనందంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట పొందుతారు.

Related Articles

Related image1
Birth Stars: ఈ 4 నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిలు అత్తింటి అదృష్ట దేవతలు.. వాళ్లతోనే సంపద, సంతోషం!
Related image2
Sun Saturn Conjunction: రెండు శత్రు గ్రహాల కలయిక.. ఈ 5 రాశులవారికి చుక్కలే!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు తప్పవు. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. దూర ప్రయాణాల వల్ల వృథా ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగులకు పనిభారం తప్పదు.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

కుటుంబ విషయాలలో మాటపట్టింపులు తొలగుతాయి. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నూతన వాహనం యోగం ఉంది. వృత్తి, వ్యాపారాలలో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికపరమైన ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్నదమ్ములతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలుంటాయి. ఇంటా బయటా రుణపరమైన ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలకు వెళ్లకపోవడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా మెరుగైన వాతావరణం ఉంటుంది. అవసరానికి బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో సొంత నిర్ణయాలు కలిసివస్తాయి. ఉద్యోగాలలో అధికారుల గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభదాయకం. 

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాల్లో కొత్త సమస్యలు వస్తాయి. ఉద్యోగులకు విశ్రాంతి లభించదు. కుటుంబ సభ్యులతో అకారణంగా మాటలు పడాల్సి వస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. మిత్రులతో మాటపట్టింపులుంటాయి. వాహన ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

దూరపు బంధువుల నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

అవసరానికి చేతిలో డబ్బు ఉండదు. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం దక్కదు. కుటుంబ సభ్యుల మాటలు మానసికంగా బాధిస్తాయి. ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది. నిరుద్యోగ యత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశం దక్కుతుంది!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి కీలక విషయాల్లో రెండు రకాల ఆలోచనల వల్ల ఇబ్బందులు తప్పవు!
Related Stories
Recommended image1
Birth Stars: ఈ 4 నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిలు అత్తింటి అదృష్ట దేవతలు.. వాళ్లతోనే సంపద, సంతోషం!
Recommended image2
Sun Saturn Conjunction: రెండు శత్రు గ్రహాల కలయిక.. ఈ 5 రాశులవారికి చుక్కలే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved