Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు స్త్రీ సంబంధ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి!
Today Rasi Phalalu:ఈ రాశి ఫలాలు 24.10.2025 శుక్రవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప ఆటంకాలు తప్పవు. ఉద్యోగాలలో ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి.
వృషభ రాశి ఫలాలు
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలలో అవరోధాలు ఉంటాయి. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి మరింత పెరుగుతుంది. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. అవసరానికి డబ్బు అందక ఇబ్బందిపడతారు. పిల్లల చదువు, ఉద్యోగ యత్నాలు మందగిస్తాయి.
మిథున రాశి ఫలాలు
ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. గౌరవ మర్యాదలకు లోటుండదు.
కర్కాటక రాశి ఫలాలు
బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలమవుతాయి. వ్యాపార విస్తరణకు కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో దైవ క్షేత్రాలు దర్శించుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.
సింహ రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలలో భాగస్వాములతో ఒప్పందాలు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగాల్లో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. సన్నిహితులతో వివాదాలు చికాకు కలిగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. స్త్రీ సంబంధ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
కన్య రాశి ఫలాలు
వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. చేపట్టిన పనుల్లో తొందరపాటు మంచిది కాదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. దూర ప్రయాణాల వల్ల శారీరక శ్రమ అధికమవుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
తుల రాశి ఫలాలు
సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.
వృశ్చిక రాశి ఫలాలు
వ్యాపారాలు లాభ సాటిగా సాగుతాయి. మిత్రులతో సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఇంటా బయటా సమస్యలు కొంత బాధిస్తాయి. ఉద్యోగాలలో తోటివారితో వివాదాలు పరిష్కారమవుతాయి. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా పడతాయి.
ధనుస్సు రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలు పుంజుకుంటాయి. కొత్త పరిచయాలు విస్తృతమవుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమించి ముందుకు సాగుతారు. విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.
మకర రాశి ఫలాలు
మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. శ్రమతో కానీ పనులు పూర్తి కావు. మిత్రుల నుంచి అప్పుల ఒత్తిడి అధికమవుతుంది. వ్యాపారాలు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.
కుంభ రాశి ఫలాలు
ఇంటా బయటా చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
మీన రాశి ఫలాలు
భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. విందు వినోదాది కార్యక్రమాలకు హాజరవుతారు. ఉద్యోగాలలో మీ నిర్ణయాలను అందరూ గౌరవిస్తారు.