Birth Month: ఈ 3 నెలల్లో పుట్టినవారికి క్షమా గుణం ఉండదు.. వీరి పగ పాములాంటిది!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన నెల, రాశిచక్రం వారి వ్యక్తిత్వాన్ని రూపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. కొన్ని నెలల్లో పుట్టిన వ్యక్తులకు క్షమించే గుణం ఉండదు. వారు అనుభవించిన బాధకు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటారు. ఆ నెలలేంటో తెలుసా?

ఏ నెలలో పుట్టిన వారికి క్షమాగుణం ఉండదు?
మరుపు మనిషికి గొప్ప వరం లాంటిది. ఎందుకంటే చెడు జ్ఞాపకాలను మర్చిపోవడం వల్ల మనశ్శాంతి దొరుకుతుంది. బాధాకరమైన విషయాలే కాదు.. పాత పగను మనసులో పెట్టుకోవడం కూడా మంచిది కాదు. అది చివరికి మనల్నే బాధిస్తుంది. కానీ కొందరు మాత్రం వారు అనుభవించిన బాధను ఎప్పటికీ మర్చిపోరు. వారికి ఆ బాధ కలిగించిన వారిని ఎప్పటికీ క్షమించరు. ఎదుటివారు కూడా అంతే బాధ అనుభవించాలని కోరుకుంటారు.
ప్రతికారం తీర్చుకునే వరకు వదిలిపెట్టరు!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన నెల, రాశి వారి వ్యక్తిత్వంపై కచ్చితమైన ప్రభావాన్ని చూపిస్తాయి. సాధారణంగా కొన్ని నెలల్లో పుట్టినవారికి ఏదైనా బాధ కలిగినా, లేదా వారిని ఎవరైనా ఇబ్బంది పెట్టినా.. “వారి పాపాన వారే పోతారులే..” “కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు”.. “పైన భగవంతుడున్నాడు.. అన్నీ చూసుకుంటాడులే” అనుకోని వదిలేస్తుంటారు. కానీ కొందరికి మాత్రం క్షమించే గుణం అస్సలు ఉండదు. వారు అనుభవించిన బాధకు రెట్టింపు బాధ ఎదుటివారు అనుభవించాలని కోరుకుంటారు. వారిపై ప్రతీకారం తీర్చుకునే టైం కోసం ఎదురుచూస్తుంటారు. వీరి స్వభావం ఎదుటి వ్యక్తికే కాదు.. వారికి కూడా ప్రమాదమే. మరి ఏ నెలలో పుట్టినవారు ఇలా ఉంటారో ఇక్కడ చూద్దాం.
జనవరి నెల
జ్యోతిష్యం ప్రకారం జనవరిలో పుట్టినవారికి క్షమించే గుణం చాలా తక్కువ. వీరు చాలా మొండి పట్టుదలతో ఉంటారు. శక్తివంతమైన వ్యక్తిత్వం వీరిది. ఎవరినైనా కోపంతో దూరం పెడితే, ఆ దారులు శాశ్వతంగా మూసుకున్నట్టే. రెండో అవకాశం ఇవ్వరు. ఇతరుల తప్పులను మర్చిపోరు. క్షమించరు. ప్రతీకారం తీర్చుకోవడానికి వేచి చూస్తారు. వీరి దగ్గర ఒకసారి నమ్మకం కోల్పోతే.. తిరిగి పొందడం అసాధ్యం. వీరు తమకు చేసిన ద్రోహాన్ని ఎప్పటికీ మర్చిపోరు.
ఆగస్టు నెల
ఆగస్టులో పుట్టినవారు చాలా నిర్దయగా ఉంటారు. వీరికి క్షమాగుణం ఉండదు. ఇతరులతో మాట్లాడటానికి కానీ.. వారి కారణాలు వినడానికి కానీ వీరు సిద్ధంగా ఉండరు. ఈ లక్షణాల వల్ల దూకుడుగా ఉంటారు. వీరి దగ్గర క్షమాపణ పొందాలనుకుంటే వారు శాంతించే వరకు వేచి చూడటమే మంచిది. కానీ అది దాదాపు అసాధ్యమేనని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
అక్టోబర్ నెల
అక్టోబర్ నెలలో పుట్టినవారు తీవ్రమైన భావోద్వేగాలను కలిగి ఉంటారు. పగ తీర్చుకోవడంలో వీరిని పాముతో పోలుస్తారు. వీరు ఎవరినీ క్షమించరు. ఏళ్ల తరబడి పగను మనసులో పెట్టుకుని ప్రతీకారం తీర్చుకుంటారు. ప్రేమించిన వారు ద్రోహం చేస్తే అస్సలు సహించరు. ఎవరైనా మోసం చేస్తే.. నిర్దయగా ప్రతీకారం తీర్చుకుంటారు.