నేడు ఓ రాశివారికి కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు వస్తాయి!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 22.09.2025 సోమవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ సకాలంలో పూర్తిచేస్తారు. పిల్లలు కొన్ని విషయాలలో మీతో విభేదిస్తారు. దూర ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు తప్పవు. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది.
వృషభ రాశి ఫలాలు
ముఖ్యమైన వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసిరావు. కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో నిలకడ లోపిస్తుంది.
మిథున రాశి ఫలాలు
ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత వరకు బయటపడతారు. ప్రయాణాలలో ఏర్పడిన కొత్త పరిచయాలతో ఆర్ధిక లాభాలు పొందుతారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. కుటుంబసభ్యుల నుంచి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది.
కర్కాటక రాశి ఫలాలు
కొన్ని విషయాలలో సమస్యలు ఎదురవుతాయి. దూర ప్రాంతాల నుంచి అందిన వార్త కొంత ఊరట కలిగిస్తుంది. ఆదాయం ఆశించిన విధంగా ఉండదు. చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులుంటాయి. ఉద్యోగాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. పిల్లల చదువు విషయాలపై దృష్టి సారిస్తారు.
సింహ రాశి ఫలాలు
బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు. వ్యాపారాలకు స్నేహితుల నుంచి పెట్టుబడులు అందుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుతాయి.
కన్య రాశి ఫలాలు
చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో లోటుపాట్లు తప్పవు. పిల్లల ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.
తుల రాశి ఫలాలు
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. కీలక వ్యవహారాలలో మిత్రుల సలహాలు తీసుకోవడం మంచిది. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి.
వృశ్చిక రాశి ఫలాలు
దూర ప్రాంత ఆప్తుల నుంచి కీలక నమాచారం అందుతుంది. చేపట్టిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేస్తారు. స్థిరాస్తి వివాదాలకు సంబంధించి కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఉద్యోగాల్లో ఉన్నతాధికారుల అనుగ్రహం కలుగుతుంది
ధనుస్సు రాశి ఫలాలు
దైవ అనుగ్రహంతో ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రయాణాలలో అవరోధాలు కలుగుతాయి.
మకర రాశి ఫలాలు
కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. ఉద్యోగులు అధికారులతో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు.
కుంభ రాశి ఫలాలు
ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు వేగవంతం చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు.
మీన రాశి ఫలాలు
ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. ఇంటా బయటా శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపారాలు విజయవంతంగా ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో మరింత జాగ్రత్త వహించాలి