MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. ఆప్తుల నుంచి శుభవార్తలు!

Today Rasi Phalalu: నేడు ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. ఆప్తుల నుంచి శుభవార్తలు!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 22.01.2026 గురువారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Jan 22 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

Related Articles

Related image1
Dream Meaning: భర్త మరో పెళ్లి చేసుకున్నట్లు కల వస్తే దాని అర్థం ఏంటో తెలుసా?
Related image2
Saturn Mercury Conjunction: 30 ఏళ్ల తర్వాత అరుదైన రాజయోగం.. అదృష్టం మొత్తం ఈ రాశులదే!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోదరుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. నూతన రుణ యత్నాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

ఇంటా బయటా మానసిక ఒత్తిడులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. నూతన రుణ యత్నాలు ఫలించవు. చేపట్టిన పనుల్లో తొందరపాటు మంచిది కాదు. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులు అధికారుల అండదండలతో ముందుకు సాగుతారు.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కొన్ని వ్యవహారాలలో శ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదు. ఉద్యోగాల్లో ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. 

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. 

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దూరపు బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన యోగం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సోదరులతో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వ్యాపారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగాలలో చిన్నపాటి చికాకులు ఉంటాయి.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

నిరుద్యోగులకు నిరాశ తప్పదు. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసిరావు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Stars: ఈ 5 నక్షత్రాల్లో పుట్టినవారు చాలా స్పెషల్.. వీరితో ఉంటే జీవితాంతం పండగే!
Recommended image2
Birth Date: ఈ తేదీలలో పుట్టిన వ్యక్తిని పెళ్లి చేసుకునే ముందు 100 సార్లు ఆలోచించండి, వీరితో చాలా కష్టం
Recommended image3
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు..!
Related Stories
Recommended image1
Dream Meaning: భర్త మరో పెళ్లి చేసుకున్నట్లు కల వస్తే దాని అర్థం ఏంటో తెలుసా?
Recommended image2
Saturn Mercury Conjunction: 30 ఏళ్ల తర్వాత అరుదైన రాజయోగం.. అదృష్టం మొత్తం ఈ రాశులదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved