నేడు ఈ రాశివారు స్త్రీ సంబంధ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 21.09.2025 ఆదివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
ఖర్చుకు తగ్గ ఆదాయం ఉండదు. ఉద్యోగులు కీలక పత్రాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు చేయాల్సి వస్తుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.
వృషభ రాశి ఫలాలు
కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. పిల్లల చదువు విషయాలపై దృష్టి సారించడం మంచిది.
మిథున రాశి ఫలాలు
దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. స్త్రీ సంబంధ విషయాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగులకు అధికారులతో వివాదాలు కలగుతాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలం. ఆదాయ వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి.
కర్కాటక రాశి ఫలాలు
రావాల్సిన డబ్బు సకాలంలో వసూలవుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శత్రు పరమైన సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి.
సింహ రాశి ఫలాలు
ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాలకు డబ్బు సహాయం చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడుల విషయంలో పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది.
కన్య రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. ఆర్థిక వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి.
తుల రాశి ఫలాలు
నూతన వ్యాపారాలు ప్రారంభించక పోవడం మంచిది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు కొంత మందకొడిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వల్ల తగిన విశ్రాంతి ఉండదు.
వృశ్చిక రాశి ఫలాలు
ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృథా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. కంటి సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిదానంగా సాగుతాయి.
ధనుస్సు రాశి ఫలాలు
కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. నిరుద్యోగులు అధికారుల అండదండలతో ఉన్నత అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలలో విశేషమైన లాభాలను పొందుతారు.
మకర రాశి ఫలాలు
వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తలనొప్పి కలిగిస్తాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పవు. దీర్ఘకాలిక అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులు మరింత కష్టపడాల్సి వస్తుంది.
కుంభ రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. రాజకీయ ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల నుంచి ఆశించిన డబ్బు సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు.
మీన రాశి ఫలాలు
వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని పనుల్లో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలుచేస్తారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.