MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 21.07.2026 మంగళవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Jul 21 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI Meta

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలలో స్థిరమైన లాభాలు అందుకుంటారు. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు కష్టానికి తగిన అవకాశాలు లభిస్తాయి.

Related Articles

Related image1
Dream Meaning: ఈ 5 కలలు వస్తే డబ్బు ఖర్చు కావడం ఖాయం, కష్టం రాబోతోందని అర్థం!
Related image2
Telugu Saying: కడుపు కూటికేడిస్తే కొప్పు పూలకేడ్చిందట.. పెద్దలు ఈ సామెత ఎందుకు చెప్పారో తెలుసా?
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

వృథా ప్రయాణాలు చేస్తారు. ఇంటా బయటా ప్రతికూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో వివాదాలు వస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగాలలో ఇతరులతో మాటపడాల్సి వస్తుంది. నిరుద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

దూరప్రాంత బంధువులతో కలిసి శుభకార్యాలకు హాజరవుతారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన లాభాలు పొందుతారు. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

కీలక వ్యవహారాల్లో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తప్పవు. బంధు మిత్రులతో ఏర్పడిన వివాదాల పరిష్కారానికి ఆటంకాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. వాహన ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు నూతన బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

ఉద్యోగాలలో అధికారుల నుంచి సానుకూలత పెరుగుతుంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా.. అవసరానికి డబ్బు అందుతుంది.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

ఆర్థిక వృద్ధి కలుగుతుంది. కీలక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఆశాజనకంగా సాగుతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉండదు. వృత్తి, ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దైవ కార్యక్రమాలపై ఆసక్తి కలుగుతుంది. నిరుద్యోగుల కష్టం వృథాగా మిగులుతుంది. కొత్త అప్పులు చేయకపోవడం మంచిది.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. సోదరులతో భూ సంబంధిత వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

కీలక వ్యవహారాలలో విజయం సాధిస్తారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో అరుదైన అవకాశాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

చేపట్టిన వ్యవహారాలు మండకొడిగా సాగుతాయి. సంతాన ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. వృథా ఖర్చులను అదుపు చేయడం మంచిది. వృత్తి, వ్యాపారాలలో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగాలలో స్వల్ప ఇబ్బందులు తప్పవు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగాలలో పనిభారం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంటా బయటా అనుకూలత పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభాకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారాలు లాభదాయకం.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Recommended image2
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Recommended image3
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Related Stories
Recommended image1
Dream Meaning: ఈ 5 కలలు వస్తే డబ్బు ఖర్చు కావడం ఖాయం, కష్టం రాబోతోందని అర్థం!
Recommended image2
Telugu Saying: కడుపు కూటికేడిస్తే కొప్పు పూలకేడ్చిందట.. పెద్దలు ఈ సామెత ఎందుకు చెప్పారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved