నేడు ఓ రాశివారు ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహాతో ముందుకు సాగడం మంచిది!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 2.11.2025 ఆదివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. విందు, వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. పిల్లలు పొటీ పరీక్షలో విజయం సాధిస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.
వృషభ రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండాలి. గృహ నిర్మాణ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి.
మిథున రాశి ఫలాలు
విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగాల్లో చిక్కులు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు.
కర్కాటక రాశి ఫలాలు
ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. నూతన ఉద్యోగ యత్నాలు సాగిస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. భూమి, వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
సింహ రాశి ఫలాలు
వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు వస్తాయి. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది.
కన్య రాశి ఫలాలు
ఉద్యోగులకు అదననపు బాధ్యతలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వాహన ప్రయాణ విషయాలలో కొంత జాగ్రత్త అవసరం.
తుల రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంతన వివాహయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలల్లో విజయం సాధిస్తారు. దీర్ఘకాలిక అప్పులు తీరి ఊరట చెందుతారు.
వృశ్చిక రాశి ఫలాలు
వ్యాపార విస్తరణకు స్నేహితులు సహాయం చేస్తారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. దైవ చింతన పెరుగుతుంది. భూ క్రయ విక్రయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.
ధనుస్సు రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలలో విశేషమైన లాభాలు పొందుతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. పిల్లల చదువు, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశనం దక్కుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
మకర రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో మాట పట్టింపులు తొలగుతాయి.
కుంభ రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగాలలో చిన్న పాటి వివాదాలుంటాయి. నూతన కార్యమాలకు శ్రీకారం చుడతారు. స్థిరాస్థి వివాదాలు పరిష్కారమవుతాయి.
మీన రాశి ఫలాలు
భూ క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కారించుకుంటారు. పిల్లల చదువు, ఉద్యోగ విషయాలలో శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులలో శ్రమ అధికంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు సాధారణంగా సాగుతాయి.