నవంబర్ 2025 మాస ఫలాలు: ఈ 5 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది!
November Horoscope: ఈ మాస ఫలాలు నవంబర్ నెలకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల మాస ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మాస ఫలాలు
ఈ మాస ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ నెల ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
నవంబర్ నెలలో మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రమ అధికమవుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు అందుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధుమిత్రులతో సందడిగా గడుపుతారు. సంతాన వివాహ విషయంలో శుభవార్తలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు అనుకూలం. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. నిరుద్యోగులు నూతన అవకాశాలు పొందుతారు.
వృషభ రాశి ఫలాలు
నవంబర్ నెల ప్రారంభంలో వృషభ రాశివారికి అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన అన్ని వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు పొందుతారు. నెలలో మధ్య నుంచి అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో చీటికిమాటికి వివాదాలు వస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
మిథున రాశి ఫలాలు
మిథున రాశివారికి నవంబర్ నెలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుంది. కొన్ని సమస్యలను స్నేహితుల సహాయంతో పరిష్కరించుకుంటారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. స్త్రీ సంబంధిత వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సంతానం విద్యా విషయాలలో పురోగతి కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలను అధికారుల సహాయంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో సొంత నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. నెలాఖరులో జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు వస్తాయి.
కర్కాటక రాశి ఫలాలు
కర్కాటక రాశివారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అన్ని వైపుల నుంచి ఆదాయం అందుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని లాభపడతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న పదవులు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. విద్యార్థుల విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలు లాభదాయకం.
సింహ రాశి ఫలాలు
సింహ రాశివారికి నవంబర్ నెల అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఎంతటి వారినైనా మీ మాట మీదకి తీసుకొస్తారు. శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ముందుకు సాగుతారు. సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సంతానం ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగులకు కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. నెలాఖరున దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
కన్య రాశి ఫలాలు
కన్యరాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నెల ప్రారంభంలో చేపట్టిన పనులు సాఫీగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. నెల మధ్య నుంచి పరిస్థితులు కాస్త మెరుగుపడతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతుల పెరుగుతాయి. విద్యార్థుల విదేశీ ప్రయాణ ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి.
తుల రాశి ఫలాలు
తుల రాశివారికి ఈ నెల మరింత ప్రతికూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు పెరుగుతాయి. వాహన ప్రయాణాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలలో పెద్దల సలహాలతో ముందుకు సాగడం మంచిది. ఉద్యోగులకు పై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులకు మరొకసారి నిరాశ తప్పదు. కొన్ని విషయాలలో తొందరపాటు వల్ల ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి.
వృశ్చిక రాశి ఫలాలు
వృశ్చిక రాశి వారికి ఈ నెల మొదటి భాగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. చాలాకాలంగా పూర్తి కాని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు కొంత ఇబ్బందికరంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. నెల మధ్య నుంచి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. అప్పులు చేయాల్సి వస్తుంది. వాహన ప్రయాణాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కంటి సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
ధనుస్సు రాశి ఫలాలు
ధనుస్సు రాశివారికి నవంబర్ లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయం తగినంత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపారానికి పెట్టుబడులు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. నెలాఖరులో జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి.
మకర రాశి ఫలాలు
మకర రాశివారికి నవంబర్ లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు కలిగినప్పటికీ నిదానంగా పూర్తవుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలం. వృత్తి, వ్యాపారాలలో చివరి నిమిషాల్లో నిర్ణయాల మార్పు వల్ల లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో పెద్దల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి.
కుంభ రాశి ఫలాలు
కుంభ రాశి వారికి ఈ నెల అంతగా కలిసిరాదు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు. వృత్తి, వ్యాపారాలు అంతగా రాణించవు. ఆర్థికంగా మరింత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. చుట్టుపక్కల వారితో ఊహించని వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. స్త్రీ సంబంధిత వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. నెలాఖరున అవసరానికి మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి.
మీన రాశి ఫలాలు
మీన రాశివారికి ఈ నెల అంతగా అనుకూలించదు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పవు. కంటి సంబంధిత సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలలో జరిమానాలు కట్టాల్సి రావచ్చు. ఇంటా బయటా కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. నెలాఖరులో కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.