MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అదృష్టయోగం, పట్టిందల్లా బంగారమే!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అదృష్టయోగం, పట్టిందల్లా బంగారమే!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 16.02.2026 సోమవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

2 Min read
Author : Kavitha G
Published : Feb 16 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఇంటి వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

Related Articles

Related image1
Birth Month: ఈ 4 నెలల్లో పుట్టినవారిని అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు.. ఎందుకో తెలుసా?
Related image2
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారు మంచి మాటతీరుతో అందరిని ఆకట్టుకుంటారు!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ప్రయాణాలలో జాగ్రత్తగా  ఉండాలి. కీలక విషయాలలో శ్రమపడ్డా ఫలితం లభించదు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

ఆత్మీయుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. మంచి మాట తీరుతో ఇంటా బయటా అందరిని ఆకట్టుకుంటారు. చేపట్టిన పనులు నూతనోత్సాహంతో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి. 

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

వృథా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలించవు. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటి వాతావరణం చికాకుగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

ఆర్థిక వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో కష్టపడ్డా ఫలితం ఉండదు. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఇంట్లో కొందరి ప్రవర్తన వల్ల మానసిక సమస్యలు తప్పవు. ఉద్యోగాలలో ఇబ్బందికర వాతావరణం ఉంటుంది.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

కీలక వ్యవహారాలలో అందరిని ఒక మాట మీదకు తీసుకువస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. నూతన వాహన యోగం ఉంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. బంధు మిత్రులతో మాటపట్టింపులు తప్పవు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. డబ్బు పరంగా ఇబ్బందులు తప్పవు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు ఉంటాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగుల శ్రమ ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. నూతన మిత్రుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభదాయకం. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

ఆర్థికంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. ఊహించని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు అధికమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు పనిభారం ఉంటుంది.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. సమయానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలతో నూతన అవకాశాలు అందుకుంటారు.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. భూ సంబంధిత క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపార భాగస్వామితో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో గతం కంటే మెరుగైన వాతావరణం ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
AI Horoscope: ఓ రాశివారు ఈరోజు మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు
Recommended image2
Mars Transit: ధనిష్ఠ నక్షత్రంలోకి కుజుడు, ఈ 4 రాశుల వారికి ఊహించని లాభాలు
Recommended image3
Lord Shiva: శివుడు ఒంటికి రాసుకునే చితి బూడిద ఎవరి శరీరానిదో తెలుసా?
Related Stories
Recommended image1
Birth Month: ఈ 4 నెలల్లో పుట్టినవారిని అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు.. ఎందుకో తెలుసా?
Recommended image2
Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారు మంచి మాటతీరుతో అందరిని ఆకట్టుకుంటారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved