MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు!

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 12.02.2026 గురువారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

2 Min read
Author : Kavitha G
Published : Feb 12 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

చేపట్టిన పనులలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. సన్నిహితుల నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

Related Articles

Related image1
Sun Rahu Conjunction: రవి, రాహువుల కలయిక.. నెల రోజులపాటు ఈ 4 రాశులవారికి నిందలు, అవమానాలు తప్పవు!
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు ఎంత ఖర్చు చేసినా డబ్బుకు లోటురాదు.. బిందాస్ లైఫ్!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ప్రముఖుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. బంధుమిత్రుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. స్థిరాస్థి వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం దక్కుతుంది.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

బంధువులతో కొన్ని విషయాల్లో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కీలక వ్యవహారాలలో అవాంతరాలు వస్తాయి. వృథా ఖర్చులు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు. రుణ ప్రయత్నాలు కలిసిరావు.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

దూర ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. డబ్బు వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

పాత మిత్రుల సహాయంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో సొంత నిర్ణయాలు కలిసివస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో పెట్టుబడులు సకాలంలో అందవు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. 

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఆర్థిక నష్టాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగినా సకాలంలో పూర్తిచేస్తారు. ఇంటా బయటా పని ఒత్తిడి పెరిగి తగిన విశ్రాంతి ఉండదు. ప్రభుత్వ వ్యవహారాలలో విమర్శలు ఎదురవుతాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ఆర్థికంగా గందరగోళ పరిస్థితులుంటాయి. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు మంచి పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

సోదరులతో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి దైర్యంగా ముందుకు సాగుతారు.చాలాకాలంగా పూర్తి కాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. మిత్రులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తికాక నిరాశ తప్పదు.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. వృత్తి, ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన కొంత బాధ కలిగిస్తుంది. నూతన వ్యాపార ప్రారంభ ప్రయత్నాలు విఫలమవుతాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
AI Horoscope: ఈరోజు ఓ రాశివారిని నమ్మిన వారే మోసం చేసే ప్రమాదం ఉంది
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి గ్రహాల అనుగ్రహం ఎక్కువ, అదృష్టం చాలా ఎక్కువ..!
Recommended image3
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు ఎంత ఖర్చు చేసినా డబ్బుకు లోటురాదు.. బిందాస్ లైఫ్!
Related Stories
Recommended image1
Sun Rahu Conjunction: రవి, రాహువుల కలయిక.. నెల రోజులపాటు ఈ 4 రాశులవారికి నిందలు, అవమానాలు తప్పవు!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు ఎంత ఖర్చు చేసినా డబ్బుకు లోటురాదు.. బిందాస్ లైఫ్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved