నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. ఆత్మీయుల నుంచి శుభవార్తలు!
Today Rasi Phalalu:ఈ రాశి ఫలాలు 1.11.2025 శనివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు తప్పవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
వృషభ రాశి ఫలాలు
నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి.
మిథున రాశి ఫలాలు
ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల సలహాలు కలిసివస్తాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి.
కర్కాటక రాశి ఫలాలు
స్థిరాస్తి ఒప్పందాలలో ఆటంకాలు తప్పవు. ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల నుంచి సమస్యలు తప్పవు. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో జాగ్రత్త అవసరం.
సింహ రాశి ఫలాలు
వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. సోదరులు కొన్ని విషయాలలో మీతో విభేదిస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో నిరాశ తప్పదు.
కన్య రాశి ఫలాలు
స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. నూతన కార్యకమాలు చేపడతారు. దూరపు బంధువుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆకస్మిక వస్తు వాహన లాభాలు పొందుతారు. బంధు వర్గం నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.
తుల రాశి ఫలాలు
కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు సర్దుమణుగుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. భూమి, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
వృశ్చిక రాశి ఫలాలు
మిత్రులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కొంత ఒత్తిడి కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.
ధనుస్సు రాశి ఫలాలు
కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలించవు. ఇంట్లో కొందరి ప్రవర్తన తలనొప్పి తెప్పిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.
మకర రాశి ఫలాలు
ఆత్మీయుల నుంచి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. సన్నిహితుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చిన్న నాటి మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి.
కుంభ రాశి ఫలాలు
వృత్తి, ఉద్యోగాలలో ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి. కొత్త అప్పులు చేస్తారు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆప్తులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.
మీన రాశి ఫలాలు
ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో రావాల్సిన ప్రమోషన్లు వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.