Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి దూరపు బంధువుల నుంచి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 01.05.2026 శుక్రవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలను ధైర్యంగా పరిష్కరించుకుంటారు.
వృషభ రాశి ఫలాలు
కొన్ని వ్యవహారాలలో ఆప్తులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.
మిథున రాశి ఫలాలు
సంఘంలో పెద్దల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
కర్కాటక రాశి ఫలాలు
సమాజంలో పరిచయాలు విస్తృతమవుతాయి. ఉద్యోగులు శాలరీ విషయంలో శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు అధిగమిస్తారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్థికంగా అనుకూలం.
సింహ రాశి ఫలాలు
కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. కొన్ని వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి. వ్యాపారాలలో ద్విస్వభావ ఆలోచనలు చేసి ఇబ్బంది పడతారు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.
కన్య రాశి ఫలాలు
దూరపు బంధువుల నుంచి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. నూతన రుణ యత్నాలు కొంత కష్టంతో పూర్తవుతాయి. బందు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.
తుల రాశి ఫలాలు
కుటుంబ పెద్దలతో సఖ్యతగా వ్యవహరిస్తారు. బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ క్రయ విక్రయాలలో విశేషమైన లాభాలు అందుతాయి. చేపట్టిన పనిలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
వృశ్చిక రాశి ఫలాలు
సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
ధనుస్సు రాశి ఫలాలు
సంతాన విద్యా విషయాలు నిరాశపరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. దైవ సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.
మకర రాశి ఫలాలు
ముఖ్యమైన వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధువుల నుంచి అందిన ఒక వార్త నిరుత్సాహపరుస్తుంది. రుణ దాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు.
కుంభ రాశి ఫలాలు
నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. మిత్రుల సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.
మీన రాశి ఫలాలు
ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. రుణ దాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. సంతాన ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో విఫలమవుతారు.

