MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • Cocroach : కలలో బొద్దింక కనిపిస్తే మంచిదా, చెడ్డదా? స్వప్న శాస్త్రం ఏం చెబుతోంది?

Cocroach : కలలో బొద్దింక కనిపిస్తే మంచిదా, చెడ్డదా? స్వప్న శాస్త్రం ఏం చెబుతోంది?

మీరు మంచి నిద్రలో ఉండగా కలలో బొద్దింక కనిపించిందా..? స్వప్న శాస్త్రం ప్రకారం దీనికి రెండు రకాల అర్థాలున్నాయి. కలలో బొద్దింక ఎగిరినట్టు ఉంటే ఒకలా, అహార పదార్థాల్లో పడ్డట్లుగా ఉంటే మరోలా ప్రభావం ఉంటుందట. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Arun Kumar P
Published : May 23 2026, 11:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మీకు కలలో బొద్దింక వచ్చిందా..?
Image Credit : Gemini AI

మీకు కలలో బొద్దింక వచ్చిందా..?

ప్రతి ఒక్కరికీ రాత్రి నిద్రలో ఏదో ఒక కల వస్తుంది. సైకాలజీ ప్రకారం… మనసులో లోతుగా పాతుకుపోయిన ఆలోచనలే కలలుగా వస్తాయి. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి కలకు ఒక అర్థం ఉంటుంది. అది భవిష్యత్తుకు సంబంధించి మంచి లేదా చెడును సూచిస్తుంది. మరి కలలో బొద్దింక కనిపిస్తే దాని అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కలలో చాలా బొద్దింకలు కనిపిస్తే...
Image Credit : Getty

కలలో చాలా బొద్దింకలు కనిపిస్తే...

బొద్దింకలు సాధారణంగా ఇంట్లోని తడి ప్రదేశాల్లో దాక్కుంటాయి. ముఖ్యంగా వంటగదిలో సింక్ చుట్టుపక్కల కనిపిస్తుంటాయి. అయితే వంటగదిలో ఎక్కువగా ఉండే మహిళలు వీటిని ఎక్కువగా చూస్తారు… కాబట్టి వారికే కలలో ఎక్కువగా బొద్దింకలు కనిపిస్తుంటాయి. 

ఒకవేళ మీ కలలో ఒకటికంటే ఎక్కువ అంటే చాలా బొద్దింకలు కనిపిస్తే అది అశుభ సంకేతం. మీ వెనుక ఎవరో హాని తలపెట్టడానికి కుట్ర పన్నుతున్నారని దీని అర్థం. మీ రహస్య శత్రువులు మిమ్మల్ని దెబ్బతీయొచ్చని ఇది హెచ్చరిస్తుంది. 

Related Articles

Related image1
Cockroach: ఈ 4 మొక్కలు మీ ఇంట్లో ఉంటే అసలు బొద్దింకలే రావు
Related image2
Cockroach Milk ఇదెక్కడి చోద్యం? బొద్దింక పాలు ఆవు పాలకన్నా మిన్న అంట!
35
ఎగిరే బొద్దింక కలలో వస్తే..
Image Credit : AI Photos

ఎగిరే బొద్దింక కలలో వస్తే..

కలలో బొద్దింకను చూడటం అంటే మీరు కొన్ని మానసిక, శారీరక ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారని అర్థం. మీ జీవితంలో మీరు తేలిగ్గా తీసుకుంటున్న చిన్న విషయాలే మీకు సమస్యలు సృష్టించవచ్చు.

కలలో ఎగిరే బొద్దింక కనిపిస్తే మీరు అకస్మాత్తుగా ఏదైనా సమస్యలో చిక్కుకోబోతున్నారని సంకేతం. దీనికి మీరు మానసికంగా సిద్ధంగా ఉండాలి. అదే మీ ఆహారంలో బొద్దింక ఉన్నట్లు కల వస్తే, మీరు చేస్తున్న పనికి ఇతరులు అడ్డంకులు సృష్టించవచ్చు. మీ పనిని పాడుచేసే అవకాశం ఉంది.

45
మంచంపై బొద్దింక ఉన్నట్లు కల వస్తే...
Image Credit : gitty images

మంచంపై బొద్దింక ఉన్నట్లు కల వస్తే...

కలలో మంచం మీద బొద్దింక కనిపిస్తే మీ వైవాహిక లేదా ప్రేమ జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది మీ బంధంపై చెడు ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తుంది. మీ భాగస్వామితో గొడవలు జరగవచ్చు. మంచం విశ్రాంతికి చిహ్నం… కాబట్టి దానిపై బొద్దింక కనిపిస్తే మీ ప్రశాంతత దెబ్బతిని, ఆరోగ్యం పాడవ్వొచ్చు.

55
కలలో బొద్దింక కనిపిస్తే శుభసూచకమే..
Image Credit : Getty

కలలో బొద్దింక కనిపిస్తే శుభసూచకమే..

కలలో బొద్దింక కనిపించడం ఎప్పుడూ అశుభమే కాదు కొన్నిసార్లు ఇది శుభ సంకేతాలను కూడా ఇస్తుంది. బొద్దింక ఎంతటి కఠిన పరిస్థితుల్లోనైనా బతకగలదు. కాబట్టి కలలో బొద్దింక కనిపిస్తే, మీ దారిలో వచ్చే ఎలాంటి సవాళ్లనైనా మీరు విజయవంతంగా ఎదుర్కొని గెలుస్తారని అర్థం.

కలలో బొద్దింకను చంపినా లేదా తరిమికొట్టినా అది శుభ సంకేతంగా భావిస్తారు. మీ రహస్య శత్రువులను, అనారోగ్యాలను, కష్టాలను మీరు అధిగమించడంలో విజయం సాధిస్తారని ఇది సూచిస్తుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆత్మీయులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Shukra Gochar :సెప్టెంబర్ 11న స్వాతి నక్షత్రంలోకి శుక్రుడు..ఈ 3 రాశులకు పట్టిందల్లా బంగారమే
Recommended image3
Mercury Transit: కన్య రాశిలోకి బుధుడు.. ఈ 4 రాశులవారి అదృష్టం రెట్టింపు కావడం పక్కా!
Related Stories
Recommended image1
Cockroach: ఈ 4 మొక్కలు మీ ఇంట్లో ఉంటే అసలు బొద్దింకలే రావు
Recommended image2
Cockroach Milk ఇదెక్కడి చోద్యం? బొద్దింక పాలు ఆవు పాలకన్నా మిన్న అంట!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved