వృశ్చిక రాశిలో రెండు గ్రహాల కలయిక: ఈ ఐదు రాశులకు డబ్బే డబ్బు
వృశ్చిక రాశిలోకి ఆల్రెడీ బుధగ్రహం ప్రవేశించింది. నవంబర్ 16న సూర్యుడు కూడా ప్రవేశించనున్నాడు. ఈ రెండి కలయిక ఐదు రాశులకు అదృష్టాన్ని తీసుకురానుంది. ముఖ్యంగా ధనప్రాప్తి కలగనుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం...
జోతిష్యశాస్త్రం ప్రకారం బుధ, సూర్య గ్రహాల కలయికను శుభంగా భావిస్తారు. అక్టోబర్ 29న ఈపాటికే బుధ గ్రహం వృశ్చిక రాశిలోకి ప్రవేశించింది. ఈ నెల అంటే నవంబర్ 16వ తేదీన సూర్య గ్రహం కూడా ఈ రాశిలోకి అడుగుపెట్టనుంది. ఫలితంగా బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ఈ యోగం.. ఐదు రాశులకు అదృష్టాన్ని తేనుంది. ఊహించని ధనప్రాప్తి కూడా కలగనుంది. మరి ఆ రాశులేంటో చూద్దాం..
మిథున రాశి..
మిథున రాశి వారి ఫేట్ మారిపోనుంది. గత కొంతకాలంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోనున్నాయి. మిథున రాశి వారు తెలివైనవారు. బుధాదిత్య యోగం వారి సంభాషణ నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి, ఉద్యోగంలో ప్రగతి ఉంటుంది. రచన, పాత్రికేయం, ప్రకటనల రంగాల్లో విజయం సాధిస్తారు. ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది.
కన్య రాశి
కన్య రాశి వారు కష్టజీవులు, తెలివైనవారు. బుధాదిత్య యోగం వారి పనితీరును మెరుగుపరుస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం, కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. విద్యార్థులకు ఉన్నత విద్యకు మంచి కళాశాలలో ప్రవేశం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.
తుల రాశి
తులా రాశి వారు స్నేహశీలురు, ఆకర్షణీయులు. బుధాదిత్య యోగం వారి వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. బుధాదిత్య యోగం వారి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రతిష్ట పెరుగుతాయి. విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళవచ్చు. కుటుంబ జీవితం సుఖంగా ఉంటుంది.
కుంభ రాశి
కుంభ రాశి వారు తెలివైనవారు, స్నేహశీలురు. బుధాదిత్య యోగం వారి తెలివితేటలను మెరుగుపరుస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి, ఆదాయం పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది.