Zodiac signs: బుధుడి వక్ర సంచారం ... డిసెంబర్ లో ఈ రాశుల పంట పండినట్లే..!
Zodiac signs: ఈ ఏడాది చివరలో బుధుడు వక్ర స్థితిలో ప్రయాణించనున్నాడు. దీని ప్రభావం జోతిష్యశాస్త్రంలో కొన్ని రాశులపై చాలా ఎక్కువగా పడనుంది. వారికి చాలా మేలు జరగనుంది.

Zodiac signs
జోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు తరచూ మారుతూనే ఉన్నాయి. కొన్ని గ్రహాలు అయితే...ప్రతి నెలా మారుతూనే ఉంటాయి. ఈ మార్పులు అన్ని రాశులపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ ప్రభావం కొన్ని రాశుల వారికి మేలు జరుగుతుంటే... మరి కొన్ని రాశులకు సమస్యలు తేవచ్చు. కాగా.. ఈ ఏడాది చివర్లో అంటే.. డిసెంబర్ లో బుధ గ్రహం వక్ర స్థితిలో ప్రయాణం చేయనుంది. బుధ గ్రహాన్ని తెలివితేటలు, వృత్తి, వ్యాపారానికి అధిపతిగా పరిగణిస్తారు. ఈ గ్రహం అనుకూలంగా ఉంటే... వృత్తి, వ్యాపారాలు బాగా కలిసొస్తాయి. డిసెంబర్ 6వ తేదీన ఈ బుధుడు వృశ్చిక రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. దీని కారణంగా.... కొన్ని రాశులకు అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. మరి, ఆ రాశులేంటో చూద్దామా....
1.వృషభ రాశి....
బుధ గ్రహ వక్ర సంచారం... వృషభ రాశివారి ఏడో ఇంట్లో జరుగుతుంది. దీని కారణంగా, ఈ రాశివారు సానుకూల ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారి వివాహ జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే....ఆ సమస్యలు ఈ సమయంలో తగ్గిపోయే అవకాశం ఉంది. కుటుంబంలో శాంతి, ఆనందం వెల్లివిరుస్తాయి. సొంత ఇల్లు కొనాలని ప్రయత్నిస్తున్నవారికి ఈ టైమ్ చాలా బాగుంటుంది. అనుకున్న పనులు జరుగుతాయి. కొత్త వాహనం కొనే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. గతంతో పోలిస్తే... ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తోబుట్టువుల మధ్య మనస్పర్థలు పరిష్కారమౌతాయి.
2.కర్కాటక రాశి...
బుధ గ్రహ వక్ర సంచారం కర్కాటక రాశివారి జీవితంలోనూ అద్భుత ప్రయోజనాలు తీసుకురానుంది. ఈ సమయంలో కర్కాటక రాశివారి ఖ్యాతి పెరుగుతుంది. సమాజం లో విలువ, గౌరవం పెరుగుతుంది. ఏ పని చేసినా దానికి తగిన ఫలితాలు పొందగలరు. ప్రతి పనిలోనూ విజయం సాధించగలరు. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలరు. దీని వల్ల విజయాలు క్యూ కడతాయి. పాత పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. వ్యాపారం చేస్తున్నవారికి మంచి లాభాలు అందుకోగలరు. జీవితంలో ఆనందం, శాంతి పెరుగుతాయి.
3.కన్య రాశి...
బుధుడి వక్ర సంచారం... కన్య రాశివారికి చాలా అనుకూలంగా మారనుంది. అనేక రంగాల్లో అభివృద్ధి సాధించగలరు. ఈ సమయంలో ఈ రాశివారి లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోతుంది. చాలా కాలంగా ఎదరుచూస్తున్న పనులు పూర్తి అవుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా మారుతుంది. మానసిక సంతృప్తి లభిస్తుంది. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యులు మీకు బహుమతులు ఇచ్చే అవకాశం ఉంది. మీ ప్రయత్నాలన్నీ విజయవంతమౌతాయి.
4.వృశ్చిక రాశి...
వృశ్చిక రాశి మొదటి ఇంట్లో బుధుడు సంచరిస్తున్నాడు. దీని కారణంగా, వృశ్చిక రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తక్కువ జీతాలతో ఇబ్బంది పడుతున్న వారికి బహుళజాతి కంపెనీలలో మంచి జీతంతో పనిచేసే అవకాశాలు లభిస్తాయి. మీరు కార్యాలయంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకు ప్రభుత్వ కాంట్రాక్టులు లభిస్తాయి. దీని కారణంగా, లాభాలు పెరుగుతాయి. గతంలో నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. సమాజంలో ఖ్యాతి పెరుగుతుంది. కుటుంబంలో శుభ సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి.