ఇంట్లో బంగారాన్ని ఎక్కడ పెట్టాలి? వాస్తుశాస్త్రం ఏం చెబుతోందంటే?
చాలా మందికి బంగారాన్ని బీరువాల్లో పెట్టే అలవాటు ఉంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారం.. బంగారు నగలను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. అసలు ఇంట్లో బంగారాన్ని ఎక్కడ పెట్టాలంటే?
వాస్తు శాస్త్రం ప్రకారం.. మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు సరైన దిశలో, స్థానంలో ఉండాలి.మనం ప్రతిదీ వాస్తు ప్రకారం చేస్తేనే మన ఇంట్లో పాజిటీవ్ ఎనర్జీ ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతుంటారు. వాస్తు శాస్త్రంలో మనకు సంబంధించి ఎన్నో చిట్కాలు ఉన్నాయి. వీటిలో ఒకటి బంగారం. అవును వాస్తు ప్రకారం.. మీ బంగారాన్ని ఇంట్లో ఎక్కడ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వాస్తు శాస్త్రం ప్రకారం.. బంగారాన్ని కొనడం, అలాగే దానిని సరైన ప్రదేశంలో ఉంచడం చాలా చాలా అవసరం. ఇంట్లో బంగారాన్ని పెట్టడం వల్ల సంపద, సౌభాగ్యాలు వస్తాయని నమ్ముతారు. అంతేకాదు మనకున్న అన్ని రకాల సమస్యలు కూడా పరిష్కారమవుతాయనే నమ్మకం ఉంది.
అయితే వాస్తు ప్రకారం.. మీరు కొన్ని బంగారు ఆభరణాలను మీ ఇంటికి నైరుతి దిశలోనే ఉంచాలి. ఇక్కడ పెట్టడం వల్ల మీ ఇంట్లో బంగారం పెరుగుతుంది. కానీ ఎట్టి పరిస్థితిలో మీరు మీ ఇంటి వాయవ్య మూలలో మాత్రం బంగారు నగలను పెట్టకూడదు.
వాస్తు శాస్త్రం ప్రకారం.. బంగారు నగలను ఉంచే గది రంగు పసుపు రంగులో ఉండాలి. ఎందుకంటే దీనివల్ల కుబేరుడు మనకు సంపద, శ్రేయస్సును పెంచుతాడని నమ్ముతారు.
ఒకవేళ మీరు అల్మారాలో బంగారు ఆభరణాలను ఉంచాలనుకుంటే.. అల్మారాను ఉత్తర దిశలో ఉంచండి. ఎందుకంటే వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు, ఆభరణాలను ఉంచడానికి ఉత్తర దిక్కు అనుకూలంగా భావిస్తారు. ఇంట్లో సంపద, అదృష్టాన్ని ఆకర్షించడానికి వాస్తు ప్రకారం మీ లాకర్ లో ఒక అద్దం ఉంచండి. ముఖ్యంగా వాస్తు ప్రకారం.. ఇంటి లాకర్ డోర్ ఎప్పుడూ బాత్రూమ్ వైపు తెరవకూడదు.