ఏ రాశి పిల్లలకు ఏ బహుమతి ఇవ్వడం బెటర్...?
చాలా ఎక్కువగా ఆలోచించగలరు. వీరికి ఏదైనా డైరీ ఇవ్వాలి. అందులో వారు తమ ఆలోచనలు రాసుకునే అవకాశం ఉంటుంది. లేదంటే వారిని మీరు షాపింగ్ కి తీసుకువెళ్లి వారికి నచ్చింది కొనుక్కునేలా చేయాలి.

Zodiac Sign
1.మేష రాశి...
మేష రాశి పిల్లలు చాలా యాక్టివ్ గా ఉంటారు. వీరికి కాసేపు మాత్రమే ఆడుకునే టాయ్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. రోజంతా ఆడుకునేలా ఉండాలి. అంది కూడా చాలా యాక్టివ్ గా ఉండే వస్తువును కోరుకుంటారు. కాబట్టి..... ఈ రాశి పిల్లలకు సైకిల్, ట్రై స్కూటర్, ట్రై సైకిల్, వాకర్ లాంటి వస్తువులను కొనుగోలు చేసి వారికి బహుమతి ఇవ్వాలి.
Zodiac Sign
2.వృషభ రాశి...
వృషభ రాశి పిల్లలు ఇంట్రావర్టర్స్. ఈ రాశివారు తమ మనసులో మాట కూడా తొందరగా బయపెట్టరు. తమ మనసులో విషయాలను తొందరగా బయటపెట్టరు. వీరు చాలా సెన్సిటివ్. కాబట్టి.... ఈ రాశివారికి ఏదైనా పుస్తకం, ఏదైనా ఆన్ లైన్ గేమ్ ఆడుకునే వస్తువును బహుమతిగా ఇవ్వాలి.
Zodiac Sign
3.మిథున రాశి..
మిథున రాశికి చెందిన పిల్లలు చాలా అద్బుతంగా మాట్లాడగలరు. చాలా ఎక్కువగా ఆలోచించగలరు. వీరికి ఏదైనా డైరీ ఇవ్వాలి. అందులో వారు తమ ఆలోచనలు రాసుకునే అవకాశం ఉంటుంది. లేదంటే వారిని మీరు షాపింగ్ కి తీసుకువెళ్లి వారికి నచ్చింది కొనుక్కునేలా చేయాలి.
Zodiac Sign
4.కర్కాటక రాశి..
ఈ రాశి పిల్లలు ఎక్కువగా సేఫ్టీని కోరుకుంటారు. కాబట్టి ఈ రాశివారికి వారికి నచ్చిన సాఫ్ట్ టాయ్స్ ని , మంచి బ్లాంకెట్ లాంటివి బహుమతిగా ఇవ్వాల్సి ఉంటుంది.
Zodiac Sign
5.సింహ రాశి..
సింహ రాశికి చెందిన పిల్లలు అందరిలోనూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉండాలని కోరుకుంటారు. వీరికి వారికి నచ్చిన బహుమతి ఏంటో అడిగి కొని ఇవ్వాలి.
Zodiac Sign
6.కన్య రాశి...
కన్య రాశికి చెందిన పిల్లలు అన్ని విషయాల్లోనూ చాలా ఛాలెంజింగ్ గా ఉంటారు. కాబట్టి ఈ రాశివారికి పజిల్స్, బుర్రకు పదును పెట్టే గేమ్స్ ఇవ్వాలి. వీరికి కాంపిటేటివ్ స్పిరిట్ ఎక్కువ. అలాంటి గేమ్స్ గిఫ్ట్ గా ఇవ్వడం మంచిది.
Zodiac Sign
7.తుల రాశి...
తుల రాశివారికి ఆర్టిస్టిక్ కలలు చాలా ఎక్కువ. వారిలోని బ్యూటిఫుల్ యాంగిల్ ని బయట పెట్టే బహుమతులు ఇవ్వాలి. కలరింగ్ బుక్, డ్రాయింగ్ బుక్ లాంటివి బహుమతిగా ఇవ్వాలి.
Zodiac Sign
8.వృశ్చిక రాశి..
ఈ రాశి పిల్లలకు క్యూరియాసిటీ చాలా ఎక్కువ. వారికి బహుతులు కూడా క్యూరియాసిటీకి తగినట్లుగానే ఇవ్వాలి అంటే గ్యాడ్జెట్స్, హైటెక్ యాక్ససరీస్ ఇవ్వడం బెటర్.
Zodiac Sign
9.ధనస్సు రాశి.
ధనస్సు రాశికి చెందిన పిల్లలు ఎక్కువగా సాహసాలు చేస్తూ ఉంటారు. వీరికి అలాంటివే ఎక్కువగా నచ్చుతూ ఉంటాయి. కాబట్టి.... ఈ రాశి పిల్లలను ఎదైనా పార్క్ కి తీసుకువెళ్లడం లాంటివి చేయాలి.
Zodiac Sign
10.మకర రాశి..
మకర రాశి పిల్లలు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. ఈ రాశివారికి చాలా ప్లానింగ్ ఎక్కువ. డబ్బులు తొందరగా వృథా చేయరు. కాబట్టి... ఈ రాశివారికి మీరు బహుమతిగా డబ్బులు ఇస్తే.. వారు దానిని దాచుకొని... తర్వాత ఉపయోగిస్తారు. వీరు డబ్బు వృథా చేయరు. చాలా ప్లానింగ్ తో ముందుకు అడుగులు వేస్తారు.
Zodiac Sign
11.కుంభ రాశి..
కుంభ రాశివారిలో చాలా క్రియేటివిటీ ఎక్కువ. ఈ రాశివారు చాలా సహజత్వాన్ని ఇష్టపడతారు. కాబట్టి ఈ రాశివారికి ఏదైనా మొక్కను బహుమతిగా ఇవ్వడం ఉత్తమం.
Zodiac Sign
12.మీన రాశి..
మీన రాశివారిలో కూడా క్రియేటివిటీ చాలా ఎక్కువ కాబట్టి... ఈ రాశివారికి కూడా కలర్ బుక్, గిటార్, వయోలిన్ లాంటివి బహుమతులను ఇవ్వాలి.