- Home
- Astrology
- Budha Shukra Transit: సెప్టెంబర్లో రెండు చేతులతో డబ్బు సంపాదించే నాలుగు రాశులు ఇవే, అంతా శుక్రుడు బుధుడు ఎఫెక్ట్
Budha Shukra Transit: సెప్టెంబర్లో రెండు చేతులతో డబ్బు సంపాదించే నాలుగు రాశులు ఇవే, అంతా శుక్రుడు బుధుడు ఎఫెక్ట్
సెప్టెంబర్ నెల కొన్ని రాశుల వారికి అపారమైన సంపదనిచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా బుధుడు, శుక్రుడు కలిసి సెప్టెంబర్ నెలలో నాలుగు రాశుల వారికి అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నారు.

బుధుడు - శుక్రుడి సంచారం
జ్యోతిష్య శాస్త్రం చెప్పిన ప్రకారం శుక్రుడు ఎంతో ముఖ్యమైన గ్రహం. ఈయన సెప్టెంబర్ 15న సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు కూడా అదే రోజున కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు గ్రహాలు స్థానం మార్చుకోవడం వల్ల నాలుగు రాశుల వారికి శుభయోగం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మేష రాశి
మేష రాశి వారికి సెప్టెంబర్ నెలలో బుధుడు, శుక్రుడు సంచారం ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా వ్యాపారం చేస్తున్న వారికి లాభాలు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. వీరికి కొత్త ఆదాయ వనరులు కూడా ఏర్పడతాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మిధున రాశి
మిధున రాశి వారికి కెరీర్ ఊపందుకుంటుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతి దక్కుతుంది. డబ్బు, గౌరవం కూడా లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వ్యక్తులకు విజయం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. పిల్లల వల్ల మీకు ఆనందం కలుగుతుంది. ఇంట్లో శాంతి, ప్రశాంతత దక్కుతుంది. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
కన్యా రాశి
కన్యా రాశి వారికి సెప్టెంబర్లో అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ఆర్థికంగా కూడా వీరు లాభాలు పొందుతారు. వీరికి సెప్టెంబర్లో అన్ని శుభాలే దక్కుతాయి. జీవితంలో ఆనందం వస్తుంది. పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు కూడా వస్తాయి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి అనుకూలమైన సమయం. ఇది జీవితంలో కూడా ఎన్నో సానుకూలమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న వారికి విజయాలు దక్కుతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. డబ్బు కూడా కొత్త వనరుల నుండి చేతికి అందుతుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు.
