Vastu tips: ఇళ్లు ప్రశాంతంగా ఉండాలంటే బాత్రూంలో ఈ 4 వస్తువులు పెడితే చాలు!
వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూంలో కొన్ని వస్తువులు ఉంచితే నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. జీవితంలో సంతోషం, శాంతి కలుగుతాయట. మరి ఆ వస్తువులెంటో మీరు తెలుసుకోండి.

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలోని ప్రతి ప్రదేశంలో నెగటివ్, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ప్రత్యేకంగా ఇంట్లో ఉండే బాత్రూమ్ నెగటివ్ ఎనర్జీని ఉత్పత్తి చేసే ప్రదేశాల్లో ఒకటి. ఈ ప్రదేశం రాహు, కేతువు లాంటి నెగటివ్ గ్రహాలతో సంబంధం కలిగి ఉంటుంది. దీనివల్ల ఇంట్లో డబ్బు సమస్యలు, ఆరోగ్య సంబంధిత సమస్యలు పెరుగుతాయి.
కానీ కొన్ని వస్తువులను బాత్రూంలో ఉంచడం ద్వారా ఇంటి నుంచి నెగటివ్ శక్తిని తొలగించవచ్చట. అంతేకాదు జీవితంలో సంతోషం, శాంతి పెరుగుతాయట. మరి ఆ వస్తువులెంటో ఓ సారి తెలుసకుందాం పదండి.

ఉప్పు
బాత్రూంలో ఒక గాజు గిన్నెలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేస్తే అక్కడి నుంచి నెగటివ్ శక్తి తొలగిపోతుంది. ఎందుకంటే ఉప్పు రాహు దోషాన్ని తొలగించి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తెస్తుంది. దీన్ని ప్రతి వారం మార్చాలి.
కర్పూరం
బాత్రూంలో ప్రతిరోజూ లేదా వారానికి రెండుసార్లు కర్పూరం వెలిగిస్తే అక్కడున్న నెగటివ్ శక్తి నశిస్తుంది. కర్పూరం నుంచి వచ్చే సువాసన పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది.
లవంగం
బాత్రూంలో రాహువు ప్రభావం ఎక్కువగా ఉంటే కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు పెరుగుతాయి. దీని నుంచి బయటపడాలంటే బాత్రూంలో 5 లవంగాలను ఒక గిన్నెలో వేసి ఉంచండి. లవంగాలలో ఉండే శక్తి రాహువు నెగటివ్ ప్రభావాలను తగ్గిస్తుంది. ప్రతి శుక్రవారం దాన్ని మార్చాలి.
పటిక
వాస్తు శాస్త్రం ప్రకారం పటిక చాలా ఉపయోగకరమైంది. ఇది నెగటివ్ శక్తిని గ్రహిస్తుంది. బాత్రూంలో నెగటివ్ శక్తి ఎక్కువగా ఉంటే అక్కడ ఒక పటిక ముక్కను ఉంచాలి. ప్రతి నెల దాన్ని మార్చడం మర్చిపోవద్దు.
ఇవి గుర్తుంచుకోండి
వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి బాత్రూమ్‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. మురికిగా ఉంటే నెగటివ్ శక్తి పెరుగుతుంది. అలాగే పగిలిన వస్తువులను బాత్రూంలో ఉంచకూడదు.