వృశ్చిక రాశి అబ్బాయిల వ్యక్తిత్వం ఇలానే ఉంటుంది..!
ఈ రాశి వారు చాలా నిజాయితీపరులు. ఎవరినీ మోసం చేయరు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు. వీరిని పూర్తిగా ఏ విషయంలో అయినా నమ్మవచ్చు.

వృశ్చిక రాశివారిని మీరు తొలిసారి కలిసినప్పుడు వారు చాలా కూల్ గా, నిశ్శబ్దంగా ఉన్నట్లు మీకు అనిపిస్తారు. ఒక్కోసారి భయానకంగా కూడా కనిపించే అవకాశం ఉంది. అయితే.. తొలిసారి మాత్రమే వారు అలా అనిపిస్తారట. వారిని మళ్లీ మళ్లీ కలిసినప్పుడు.. వారిలోని విభిన్న కోణాలు బయటపడతాయట. జోతిష్యశాస్త్రం ప్రకారం.. వృశ్చిక రాశి పురుషులు వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం...
వృశ్చిక రాశి పురుషులు తరచుగా ప్రతిదానిపై అనుమానం కలిగి ఉంటారు. వారు స్వతహాగా మానిప్యులేటివ్. అన్ని విషయాల్లోనూ చాలా ఫాస్ట్ గా ఉంటారు. వృత్తిపరంగా, వారు తమ పనిని ఎలా పూర్తి చేయాలో, డబ్బు సంపాదించాలో వీరికి బాగా తెలుసు. అందరి మద్దతు కూడగట్టగల సత్తా వారికి ఉంది. భాగస్వాములుగా, వారు ఆధిపత్యం చెలాయిస్తుంటారు. తమ భార్య పై వీరిదే పెత్తనం ఎక్కువగా ఉంటుంది.
ఈ రాశి అబ్బాయిలు ఒక్కోసారి నోరు జారి ఎవరినైనా ఏదైనా అనే అవకాశం ఉంది. కానీ కావాలని.. ఎదుటివారిని ఇబ్బంది పెట్టాలి అనే ఉధ్దేశంతో వారు అలా చేయరు. పరిస్థితుల కారణంగా అలా అనాల్సి రావచ్చు. ఈ రాశి వారు చాలా నిజాయితీపరులు. ఎవరినీ మోసం చేయరు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు. వీరిని పూర్తిగా ఏ విషయంలో అయినా నమ్మవచ్చు.
వృశ్చిక రాశి పురుషులు చాలా కష్టపడి పని చేస్తారు. వారు తమ పనిని ఉద్రేకంతో చేస్తారు. ఒకవేళ ఓడిపోయినా.. వారు బాధ పడరు. మళ్లీ కష్టపడి పని చేయడానికి రెడీ అవుతారు. ఓడిపోయాం కదా అని వెనకడుగు వేయరు. విజయం సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. వారు సాధించాలి అనుకున్న లక్ష్యాలను సాధించి తీరతారు.
Scorpio
వారు తమ మార్గంలో పనులను చేయడానికి ఇష్టపడతారు. బాధ్యత తీసుకోవడాన్ని ఇష్టపడతారు. ఈ రాశివారు తాము పని చేయడం మాత్రమే కాదు... ఎదుటివారి చేత కూడా పని చేయించగల సామర్థ్యం వీరిలో ఉంటుంది.
వృశ్చిక రాశి పురుషులు చాలా కఠువుగా ఉంటారు. కోపం కూడా చాలా ఎక్కువ అనే చెప్పాలి. తమను మోసం చేసిన వారిపై వారు ప్రతీకారం తీర్చుకుంటారు, తమకు అన్యాయం చేసిన వారిని వీరు అంత తేలిగ్గా క్షమించరు. వారు పగను కలిగి ఉంటారు. తమకు నచ్చని వారిపై పగ సాధించి.. అప్పుడు తృప్తి చెందుతారు.