MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Zodiac Signs : ఈ 3 రాశుల వారు చాలా ధైర్యవంతులు.. ఇదే వీరిని హీరోలను చేస్తుంది

Zodiac Signs : ఈ 3 రాశుల వారు చాలా ధైర్యవంతులు.. ఇదే వీరిని హీరోలను చేస్తుంది

Zodiac Signs :  జ్యోతిష్యం ప్రకారం కొన్ని రాశులవారు పుట్టుకతోనే ధైర్యవంతులు. అంటే సినిమాల్లో హీరోలమాదిరిగా ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఈ రాశులవారు నిజజీవితంలో హీరోగా గుర్తింపు పొందుతారు. 

2 Min read
Author : Arun Kumar P
Published : Sep 20 2025, 02:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఈ రాశులవారు రియల్ లైఫ్ హీరోలు గూరూ..
Image Credit : AI

ఈ రాశులవారు రియల్ లైఫ్ హీరోలు గూరూ..

Zodiac Signs : జీవితం ఎప్పుడూ సాఫీగా సాగదు. సవాళ్లు, అడ్డంకులు, వ్యతిరేకతలు మనుషులను పరీక్షిస్తాయి. కొందరు భయపడి వెనక్కి తగ్గుతారు… కానీ మరికొందరు వీటన్నింటిని ధైర్యంగా ఎదుర్కొనిమరీ అనుకున్నది సాధిస్తారు… జీవితాన్ని గెలుస్తారు.

జ్యోతిష్యం ప్రకారం కొన్ని రాశులవారు పుట్టుకతోనే ధైర్యవంతులు. వీరి ధైర్యమే వారిని నిజజీవితంలో హీరోలను చేస్తుంది. ఇలా మేషం, సింహం, ధనుస్సు రాశుల వారు ధైర్యానికి, మనోస్థైర్యానికి ప్రసిద్ధి. ఎలాంటి కష్టమొచ్చినా, ఎంత పెద్ద శత్రువు ఎదురైనా వీరు అస్సలు చలించరు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మేషరాశి
Image Credit : Pixabay

మేషరాశి

మేషరాశి వారు పుట్టుకతోనే విజయం సాధించాలనే తపనతో ఉంటారు. కుటుంబం, స్నేహితులు, ఉద్యోగ జీవితంలో కూడా ధైర్యంగా ఉంటారు. అనుకోని అడ్డంకులు వస్తే వాటిని నేరుగా ఎదుర్కొని పరిష్కరించగల సత్తా వీరికి ఉంది.

ఉదాహరణకు ఒక మేషరాశి విద్యార్థి కఠినమైన పరీక్షలో ఫెయిల్ అయినా, వెంటనే మరింత పట్టుదలతో, ఎక్కువ శ్రద్దతో కష్టపడి చదవుతూ ముందుకు సాగుతాడు. వీరి మనోస్థైర్యం, లక్ష్యం వైపు సాగే తత్వం వీరిని ప్రత్యేకంగా నిలుపుతుంది. కాబట్టి మొదట ఫెయిల్యూర్స్ ఎదురైనా చివరకు విజయం వీరిని వరిస్తుంది.

35
సింహరాశి
Image Credit : Pixabay

సింహరాశి

సింహరాశి వారు ఎదుటివారు వ్యతిరేకిస్తున్నా వెనకడుగు వేయరు. వారిలోని ఆత్మవిశ్వాసం, ధైర్యం పెద్ద బాధ్యతలను స్వీకరించేలా చేస్తాయి. ఇలా ధైర్యంగా ముందుకు వెళ్లే మనస్తత్వమే వీరిని ఏ రంగంలో అయినా రాణించేలా చేస్తుంది.

ఉదాహరణకు పనిచేసే సంస్థలో ఏదైనా సమస్య వస్తే సింహరాశివారు నాయకుడిలా ధైర్యంగా నిలబడతారు… టీమ్ మొత్తాన్ని సరైన మార్గంలో నడిపిస్తాడు. వీరి వ్యక్తిత్వం, నిజాయితీ, నాయకత్వ లక్షణాలు ఇతరులను ఆకర్షిస్తాయి. వీరు ఎప్పుడూ భయపడరు, సవాళ్లను అధిగమించి విజయం సాధిస్తారు. ఉద్యోగమే కాదు వ్యాపారంలోనూ వీరు దూకుడును ప్రదర్శిస్తారు.

45
ధనుస్సు రాశి
Image Credit : Pixabay

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు సాధారణంగా తెలివితేటలతో, అనుభవంతో సమస్యలను పరిష్కరించడంలో ప్రసిద్ధులు. కానీ కీలక సమయాల్లో వారు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో నిలబడతారు. ఇలా ధనుస్సు రాశి ఉద్యోగి కఠినమైన ప్రాజెక్టును చేపట్టి, ఎన్ని అడ్డంకులు ఎదురైనా చలించకుండా పూర్తి చేస్తాడు. జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినా మనోస్థైర్యంతో ముందుకు సాగుతారు. వీరి నమ్మకం, ధైర్యం గొప్ప విజయాలకు దారితీస్తాయి.

55
 ఈ రాశులవారు ఆదర్శం...
Image Credit : AI

ఈ రాశులవారు ఆదర్శం...

మేషం, సింహం, ధనుస్సు రాశుల వారు జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడంలో ప్రత్యేకమైనవారు. వీరి ధైర్యం, మనోస్థైర్యం విజయానికి ముఖ్య కారణాలు. సింహం ఎదురైనా వీరు చలించరు. జీవితంలో గెలవాలంటే మనోస్థైర్యం, ధైర్యం, కార్యాచరణ ముఖ్యం అని వీరు అందరికీ నేర్పుతారు. కఠిన పరిస్థితుల్లోనూ వీరు ధైర్యంగా ఉండటం చూస్తే ఇతరులకు కూడా భయం లేకుండా ముందుకు వెళ్లే నమ్మకం, ధైర్యం వస్తాయి.

గమనిక

ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం, సాధారణ జ్యోతిష్య అంచనాల ఆధారంగా రాయబడింది. దీని కచ్చితత్వాన్ని ఏషియానెట్ తెలుగు నిర్ధారించదు. పూర్తి వివరాలకు జ్యోతిష్యులను సంప్రదించడం మంచిది

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
వైరల్ న్యూస్
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు.. వ్యాపారంలో పురోగతి!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసిరావు!
Related Stories
Recommended image1
zodiac sign : ఈ 3 రాశులవారికి నవ్వడమే తెలీదు... బ్రహ్మానందం కామెడీ కూడా వీరిముందు తుస్సుమంటుంది
Recommended image2
Shani Transit : ఈ 5 రాశులవారి శని పోయినట్లే... ఇక డబ్బు, ఉద్యోగం, బిజినెస్, విదేశీయానం, పెళ్లి .. అబ్బో ఇంకెన్నో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved