- Home
- Astrology
- zodiac sign : ఈ 3 రాశులవారికి నవ్వడమే తెలీదు... బ్రహ్మానందం కామెడీ కూడా వీరిముందు తుస్సుమంటుంది
zodiac sign : ఈ 3 రాశులవారికి నవ్వడమే తెలీదు... బ్రహ్మానందం కామెడీ కూడా వీరిముందు తుస్సుమంటుంది
Zodiac Sign : కొన్ని రాశుల వారు తమ సంతోషాన్ని బహిరంగంగా చూపించరు… మనసులో ఎంత ఆనందం ఉన్నా దాన్ని నలుగురిలో అస్సలు బైటపెట్టరు. ఎప్పుడూ చాలా సీరియస్ గా కనిపిస్తారు. అలాంటి రాశులేవో తెలుసా?

ఈ రాశులవారు యమ సీరియస్ గురూ..
Zodiac Sign : ఏ రాశిలో పుట్టినవారి మానసిక స్థితి ఎలా ఉంటుందో జ్యోతిష్యులు అంచనా వేస్తుంటారు. పుట్టిన గడియలు, రాశి, నక్షత్రాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి… కొన్ని అలవాట్లు పుట్టుకతోనే వస్తాయి. ఇలా కొన్ని రాశులవారికి ఎప్పుడూ సీరియస్ గా ఉండటం చిన్నప్పటినుండి అలవాటు… ఇది పెద్దయ్యాక కూడా కొనసాగుతుంది. చివరకు బ్రహ్మానందం కామెడీ చూసినా ముఖంలో నవ్వు కనిపించడదు. ఎంత ఆనందం కలిగినా దాని బైటపెట్టరు.
బహిరంగంగా నవ్వరు.!
జ్యోతిష్యుల ప్రకారం ఓ 3 రాశులవారు చాలా సీరియస్ గా ఉంటారని… కుటుంబసభ్యులముందు కూడా గంభీరంగా ఉంటారట… మనసుకు దగ్గరైనవారితో కూడా సంతోషాన్ని పంచుకోడానికి ఇష్టపడరట. ఇలా ఏఏ రాశులవారు ముఖంపై నవ్వు కనిపించనివ్వరు… ఎప్పుడూ సీరియస్ గా ఉంటారో ఇక్కడ తెలుసుకుందాం.
మకరం (Capricorn)
మకర రాశి వారు బాధ్యత, క్రమశిక్షణతో ఉంటారు. జీవితాన్ని కర్తవ్యంగా భావిస్తారు. అందుకే ఎప్పుడూ సీరియస్ గా ఉంటూ ముఖంపై చిరునవ్వు కనిపించనివ్వరు. ఎంత హాస్యభరిత సన్నివేశమైన వీరిని నవ్వించలేదు. అయితే అత్యంత సన్నిహితుల మధ్య కాస్త ఓపెన్ అవుతుంటారు… తన భావాలను బయటపెట్టడానికి ఇష్టపడతారు. కానీ బహిరంగంగా మాత్రం అస్సలు సంతోషాన్ని బైటపెట్టరు.
కన్య (Virgo)
కన్య రాశి వారు ఎప్పుడూ ఏదో ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తారు. జీవితంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా క్రమబద్ధంగా నడవాలనుకుంటారు. అందుకే ఎప్పుడూ ఏదో ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తారు. ఎవరైనా హాస్యం చేసినా, 'ఇది సరైన సమయమా?' అనేలా వారి వ్యవహారతీరు ఉంటుంది… ఆ కామెడీని ఆస్వాదించలేరు. ఇలా ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు ఉంటారు.. నవ్వును బయటపెట్టలేరు.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారు లోతైన ఆలోచనాపరులు… తమ భావాలను లోపల అణచిపెట్టుకుంటారు. ఎవరైనా హాస్యం చేసినా వెంటనే నవ్వకుండా ఆ వ్యక్తిని విశ్లేషిస్తారు. 'ఈ నవ్వు వెనుక ఉద్దేశం ఏంటి?' అని ఆలోచిస్తారు. ఇలా కాస్త తార్కిక మనస్తత్వం కలిగివుండటంవల్ల వీరు కామెడీని ఎంజాయ్ చేయలేకపోతారు.
మనసులోనే ప్రశాంతంగా ఆనందాన్ని అనుభవిస్తారు.!
మనసు సంతోషంగా ఉన్నా ముఖంలో సీరియస్‌గా కనిపించే రాశులు ఇవి. వీరి స్వభావం వల్ల తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ వారు ప్రశాంతంగా ఆనందాన్ని అనుభవిస్తారు. బయటకు చూపించడంలోనే తేడా.
గమనిక
ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం, సాధారణ జ్యోతిష్య అంచనాల ఆధారంగా రాయబడింది. దీని కచ్చితత్వాన్ని ఏషియానెట్ తెలుగు నిర్ధారించదు. పూర్తి వివరాలకు జ్యోతిష్యులను సంప్రదించడం మంచిది