MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Zodiac Signs: ఈ 4 రాశులవారికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ! మీది ఏ రాశి?

Zodiac Signs: ఈ 4 రాశులవారికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ! మీది ఏ రాశి?

Zodiac Signs: ప్రమోషన్ రావాలని ప్రతి ఉద్యోగి కోరుకుంటాడు. కష్టపడి పనిచేయడంతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలని చాలామంది భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉద్యోగంలో ప్రమోషన్, లేదా కెరీర్‌లో పురోగతి సాధించే అవకాశాలు ఎక్కువగా ఉండే రాశులేవో చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Jul 08 2026, 03:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఈ రాశులవారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ
Image Credit : stockPhoto

ఈ రాశులవారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ

ఉద్యోగ జీవితంలో ప్రమోషన్ అనేది ప్రతి ఒక్కరి లక్ష్యం. కష్టపడి పనిచేయడం, స్కిల్స్ ని పెంచుకోవడం, సరైన సమయంలో అవకాశాలను అందిపుచ్చుకోవడం వంటి అంశాలు ప్రమోషన్‌కు ప్రధాన కారణాలు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం, రాశుల స్వభావం కూడా కెరీర్ పురోగతిపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా గురుడు, శని, సూర్యుడు వంటి గ్రహాల అనుకూల స్థితి ఉద్యోగంలో గుర్తింపు, బాధ్యతలు, పదోన్నతి అవకాశాలను పెంచుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. పండితుల ప్రకారం ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న రాశులేవో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మేష రాశి
Image Credit : Asianet News

మేష రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశివారికి నాయకత్వ లక్షణాలు సహజంగా ఉంటాయి. కొత్త బాధ్యతలను స్వీకరించడంలో వీరు వెనుకాడరు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వీరి సొంతం. దానివల్ల ఉన్నతాధికారుల దృష్టిలో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురుడు, శని అనుకూలంగా ఉన్న సమయంలో వీరికి పదోన్నతి, కొత్త బాధ్యతలు లేదా మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.

35
సింహ రాశి
Image Credit : Chat gpt

సింహ రాశి

సింహ రాశివారు ఆత్మవిశ్వాసం, నాయకత్వం, నిర్వహణ నైపుణ్యాలతో ప్రత్యేక గుర్తింపు పొందుతారు. టీంని సమర్థంగా నడిపించే సామర్థ్యం వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఆఫీసులో తమ ప్రతిభను చాటుకునే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ప్రమోషన్ అవకాశాలు పెరుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. సూర్యుడి అనుగ్రహం బలంగా ఉన్న సమయంలో వీరు ఉన్నత స్థానాలకు ఎదిగే అవకాశాలు పెరుగుతాయని పండితులు చెబుతున్నారు.

45
కన్య రాశి
Image Credit : Getty

కన్య రాశి

కన్య రాశి వారికి క్రమశిక్షణ, విశ్లేషణాత్మక ఆలోచన, పనిలో పరిపూర్ణత ముఖ్యమైన లక్షణాలు. ఏ పని అప్పగించినా బాధ్యతగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. చిన్న విషయాలను కూడా జాగ్రత్తగా పరిశీలించడం వల్ల అధికారుల నమ్మకాన్ని సంపాదిస్తారు. శని, బుధుడు అనుకూలంగా ఉన్న సమయంలో వీరి పనితీరుకు గుర్తింపు లభించి ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

55
వృశ్చిక రాశి
Image Credit : Getty

వృశ్చిక రాశి

వృశ్చిక రాశివారు పట్టుదల, రహస్యాలను మనసులోనే దాచుకునే స్వభావం, సమస్యలను లోతుగా విశ్లేషించే నైపుణ్యం కలిగి ఉంటారు. వీటివల్ల ఉద్యోగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటారని పండితులు చెబుతున్నారు. వీరు క్లిష్టమైన ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఎక్కువ. అనుకూల గ్రహస్థితులు ఉన్న సమయంలో కెరీర్‌లో కీలకమైన మార్పులు, పదోన్నతులు దక్కే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి. అయితే ఉద్యోగంలో ఎదగాలంటే జ్యోతిష్య సూచనలతో పాటు నిరంతర కృషి, నైపుణ్యాల అభివృద్ధి, కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్‌వర్క్ వంటివి ముఖ్యమైనే విషయాన్ని మర్చిపోవద్దు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jupiter Effects: గురు ప్రభావంతో గజకేసరి యోగం.. ఈ 6 రాశులకు అక్టోబర్ లో డబ్బే డబ్బు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి!
Recommended image3
Mercury Venus Conjunction: తుల రాశిలో అద్భుతమైన యోగం.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు బ్రేకప్ తర్వాత అస్సలు ఫీల్ కారు! ఎందుకో తెలుసా?
Recommended image2
Sun Transit: శని నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 4 రాశులకు అదృష్టం తలుపు తట్టడం ఖాయం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved