Astrology: ఈ అక్షరంతో పేరున్న వారికి కష్టాలు ఎక్కువ, కానీ జీవితంలో అన్నుకున్నది సాధిస్తారు.
సాంకేతికంగా ఎంత ఎదిగినా ఇప్పటికీ మనలో చాలా మంది జ్యోతిష్యాన్ని నమ్ముతారు. పిల్లలు పుట్టిన వెంటనే జాతకం ఎలా ఉందో చూపిస్తారు. పండితుల సూచనల మేరకు ఏ పేరు పెట్టాలో నిర్ణయిస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ లెటర్‌తో పేరున్న వారి జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

మనం పుట్టిన తేదీ, సమయం ఆధారంగా మన పేరును నిర్ణయిస్తారని తెలిసిందే. జ్యోతిష్యశాస్త్రంలో ఇందుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. జన్మించిన నక్షత్రం ఆధారంగా పేరులో మొదటి అక్షరాన్ని పండితులు సూచిస్తారు. అందుకే మన పేరు, మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని చాలా మంది విశ్వసిస్తుంటారు. కొన్ని అక్షరాలతో మొదలయ్యే పేరున్న వారు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. కానీ మొదట్లో మాత్రం కష్టాలు ఎదుర్కొంటారు. కానీ వాటిని విజయవంతంగా తట్టుకొని విజయాలను సాధిస్తారు. ఇంతకీ ఆ పేర్లు ఏంటంటే.

S అక్షరంతో మొదలైన పేర్లు:
S అక్షరంతో ప్రారంభమయ్యే పేరున్న వారి జీవితాలు సవాళ్లతో కూడినవిగా ఉంటాయి. వీరికి జీవితంలో చాలా సమస్యలు వస్తాయి. అయితే సమస్యలను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొంటారు. కష్టాన్ని పోరాటంతో జయిస్తారు. వీరు కష్టాన్ని ఎక్కువగా విశ్వవిస్తారు. ఇతరులపై కంటే తమను తాము ఎక్కువగా విశ్వసిస్తారు. ఆ ఆత్మవిశ్వాసంతోనే విజయాలను అందుకుంటారు.
R అక్షరంతో పేర్లున్న వారు:
ఈ అక్షరంతో ప్రారంభమయ్యే పేరున్న వారికి ఆత్మ విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. శ్రమతో పాటు వీరికి అదృష్టం కలిసొస్తుంది. దీంతో జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటారు. వీరి శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. 50 శాతం కష్టానికి మరో 50 శాతం అదృష్టం కలిసొస్తుంది. దీంతో విజయాలను అందుకుంటారు.
A అక్షరంతో పేరున్న వారు:
ఆల్ఫాబెట్‌లో మొదటి లెటర్ అయిన Aతో ప్రారంభమయ్యే పేరున్న వారు చాలా నిజాయితీపరులు. వీరికి కష్టపడి పనిచేసే స్వభావం ఉంటుంది. వీరికి కష్టాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ ఆత్మ విశ్వాసంతో అనుకున్నది సాధిస్తారు. జీవితాన్ని పాజిటివ్ ఆటిట్యూడ్‌తో గడుపుతారు. సంపద, మంచి కీర్తిని సంపాదించుకుంటారు.
నోట్: పైన తెలిపిన విషయాలు పలువురు పండితులు, శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

