- Home
- Astrology
- Akshaya Tritiya: 'అక్షయ తృతీయ' రోజు జాతక దోషాలతో బాధపడేవారికి ప్రత్యేకం.. ఇలా చేస్తే అంతా శుభమే!
Akshaya Tritiya: 'అక్షయ తృతీయ' రోజు జాతక దోషాలతో బాధపడేవారికి ప్రత్యేకం.. ఇలా చేస్తే అంతా శుభమే!
Akshaya Tritiya: అక్షయ తృతీయ అంటే బంగారం కొనుక్కునే పండగగా చేసేసారు మనవాళ్లు. ఈ పండగ రోజు ఎంతో కొంత బంగారం కొంటే చాలు.. సిరి సంపదలు సమకూరుతాయనేది ఓ నమ్మకం గా మార్చేసారు.

akshaya tritiya
అందుకే ప్రతి ఏటా అక్షర తృతీయ పండగకు బంగారు షాపులు జనాలతో కిక్కిరిపోతుంటాయి. అయితే అక్షర తృతీయ అంటే కేవలం బంగారం కొనుక్కునే రోజు అనా అర్దం...? అసలు ఈ రోజు ఏం చేయాలని మన హిందూ ధర్మం ఏమని చెప్తోంది. అలాగే అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే..??
Akshaya Tritiya
అక్షయ తృతీయ రోజు ఇతరులకు ఉపకారం చేసే ఏ చిన్న పనిచేసినా అది మీకు పుణ్యాన్ని ఇస్తుందని మనకు ధర్మ శాస్త్రాలు చెప్తున్నాయి. అక్షయ తృతీయలో అక్షయ పదానికి అర్ధం ఎప్పటికీ అంతం లేనిదని, నశించనది అని. ఈ రోజు ప్రారంభించిన పని ఎప్పటికీ ఆగకుండా కొనసాగుతుందని ఒక నమ్మకం.
Akshaya Tritiya
ఈ నమ్మకంతోనే ప్రజలు ఈ రోజున తమ అనేక శుభ కార్యాలను ప్రారంభించడానికి ఆసక్తిని చూపిస్తూంటారు. తద్వారా అక్షయమైన ఫలితాన్ని పొందడమే గాక... తరగని పుణ్యాన్ని పొందుతారని పండితులు చెప్తున్నారు. అయితే అవన్నీ వదిలేసి మనం కేవలం బంగారం కొనుక్కోవటం మీదే దృష్టి పెడుతున్నాము.
Akshaya Tritiya
అందుకే అక్షయ తృతీయ నాడు ఒక్క పుణ్య క్రతువైనా చేయమని శాస్త్రాల్లో చెప్తారు. అంతేకాదు జాతకరీత్యా గ్రహ,నక్షిత్ర దోషాలతో ఇబ్బందిపడే వారు...ఈ రోజున ఇబ్బందుల్లో ఉన్న ఎవరికైనా ఏ చిన్న సాయం చేసినా.. దాతలకు అది పుణ్యాన్ని ఇచ్చి, సమస్యల నుంచి బయిటపడేస్తుంది.
Akshaya Tritiya
అలాగే అక్షయ తృతీయ నాడు దద్యాన్నం దానం చేస్తే మంచిది. దద్యాన్నం అంటే పెరుగన్నం. ప్రస్తుత వేసవి కాలంలో పెరగన్నంతో ఇతరులకు భోజనం పెడితే పుణ్యం వస్తుంది. వీటితో పాటు అక్షయ తృతీయ రోజు గొడుగు, చెప్పులు, నీరు దానం చేసినా తరగని పుణ్యం లభిస్తుంది.
Akshaya Tritiya
ఎందుకంటే వేసవి కాలంలో అత్యవసరమైనవి అవే. వాటిని ఎవరైతే తీరుస్తారో వారికి పుణ్యము లభిస్తుంది. అక్షయ తృతీయ రోజు గౌరీ దేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని చెప్పబడింది. అలాగే మీరు కనుక వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటూంటే మాత్రం ఈ రోజున శయ్య దానం చేస్తే పుణ్యం లభిస్తుంది. శయ్య దానం అంటే ఇతరులకు మంచాన్ని దానంగా ఇవ్వటమే.
Akshaya Tritiya
ఇక మీకు వివాహం లేటు అవుతున్నా, పితృ దోషాలతో వచ్చే సమస్యలు పోవాలన్నా... వస్త్రం దానంగా ఇవ్వడంతో పాటు స్వయం పాకం దానం చేయడం పితృ దోషాలు కూడా తీరుతాయి. ముఖ్యంగా తెల్లని వస్త్రం పితృ దేవతలకు ఆనందకరమైనదని మన శాస్త్రాలు చెప్తున్నారు. వీటిలో మీకు అనువైనవి పాటిస్తే అక్షయ తృతీయ మీకు సకల సౌక్యాలను కలగజేస్తుంది. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజు హానికరమైన గ్రహాల ప్రభావాలను తగ్గించగలదని నమ్ముతారు. జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 9949459841