Valentine Week: ఏ రాశివారి లవ్ సక్సెస్ అవుతుంది..?
వాలంటైన్స్ డే రోజున.. చాలా మంది ప్రేమ పరీక్ష రాయనున్నారు. అంటే.. కొందరు ప్రపోజ్ చేయడానికి రెడీ అవుతుంటారు. మరి వారిలో ఎంత మంది ప్రేమ సక్సెస్ అవుతుందో..? ఎవరిది ఫెయిల్ అవుతుందో.. జోతిష్య శాస్త్రం ప్రకారం చూసేద్దామా..

వాలంటైన్ వీక్ 2022 ప్రారంభమైంది. వాలెంట్స్ డే మరి కొద్ది రోజుల్లో మనముందుకు రానుంది. ఈ వాలంటైన్ వీక్ లో, వాలంటైన్స్ డే రోజున.. చాలా మంది ప్రేమ పరీక్ష రాయనున్నారు. అంటే.. కొందరు ప్రపోజ్ చేయడానికి రెడీ అవుతుంటారు. మరి వారిలో ఎంత మంది ప్రేమ సక్సెస్ అవుతుందో..? ఎవరిది ఫెయిల్ అవుతుందో.. జోతిష్య శాస్త్రం ప్రకారం చూసేద్దామా..
1.మేష రాశి..
ఈ రాశివారు.. తాము ప్రేమించిన వ్యక్తికి ప్రపోజ్ చేసే సమయంలోనూ ఈగో చూపిస్తారు. కాబట్టి.. ఆ ఈగో ఎంత దూరం పెడితే.. మీకు మీ ప్రేమ అంత దగ్గరౌతుంది. ఈ వాలంటైన్ వీక్ లో ప్రపోజ్ చేస్తే.. ఏప్రిల్ నెల వచ్చేనాటికి మీ బంధం మరింత బలంగా మారనుంది. అయితే.. మీరు మీ పార్ట్ నర్ ముందు నిజాయితీగా ఉండాలి. మీరు చేయలేని వాగ్దానాలు చేయకపోవడమే మంచిది. మీరు వారి ముందు బిల్డప్ కోసం గొప్పలు పోయి.. ప్రామిస్ లు చేస్తే.. తర్వాత అవి తీర్చలేక ఇబ్బంది పడతారు.
2.వృషభ రాశి..
ఈ రాశివారికి ఈ వాలంటైన్ వీక్ బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. గతంలో కోల్పోయిన స్పార్క్ మళ్లీ తిరిగి వస్తుంది. మీరు మీ పార్ట్ నర్ తో బాగా తొందరగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక తాము ఒంటరిగా ఉన్నామని కొందరు ఫీలౌతూ ఉంటారు. వారికి ఈ ఏడాది ముగిసే నాటికి.. వారి జీవితంలోకి ప్రేమ అడుగుపెట్టే అవకాశం ఎక్కువగా ఉంది.
3.మిథున రాశి..
మీ భాగస్వామిపై విశ్వాసం ఉంచండి, వారితో ఆప్యాయంగా ఉండండి. మిమ్మల్ని బాగా అర్థం చేసుకునే అవకాశాన్ని వారికి అందించండి. కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం.. దూరమైన అనుభూతిని ఎదుర్కొన్నప్పటికీ, వారితో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నాలు చేయండి. అపార్థాలను పరిష్కరించండి .ముఖ్యమైన వాటిని గుర్తుంచుకోండి. మీ గత ప్రేమ జీవితంలోని కొంతమంది సభ్యుల ఉనికి మీ ప్రస్తుత సంబంధంలో గందరగోళానికి కారణం కావచ్చు.
4.కర్కాటక రాశి..
ఈ రాశివారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వ్యక్తి ఈ వారం కలిసే అవకాశం ఉంది. వీరు కొత్తగా ప్రేమను రుచి చూడనున్నారు. ఆల్రెడీ ప్రేమలో ఉన్నవారు.. పెళ్లి వైపు అడుగులు వేసే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. మీ పార్ట్ నర్ తో గొడవలు పడకుండా.. వారు చెప్పేది సహనంగా వింటే.. వారి అభిప్రాయాలకు మీరు గౌరవం ఇస్తే.. మీ బంధం సవ్యంగా సాగుతుంది.
5.సింహ రాశి..
ఈ వాలంటైన్ వీక్ లో సింహ రాశివారి ప్రేమ తీరానికి చేరనుంది. లైఫ్ లాంగ్ ఉండే ప్రేమ వీరికి దొరుకుతుంది. ప్రేమించిన వారితో మధురమైన సమయాన్ని గడిపే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రేమించిన వారికి.. మీ ప్రేమ విషయాన్ని చెప్పడానికి కూడా ఇదే సరైన సమయం.
6.కన్య రాశి..
వీరు కోరుకుంటున్న ప్రేమ వీరికి దక్కుతుంది. ఆ ప్రేమను మీరు శాశ్వతంగా ఆస్వాదించవచ్చు. మీ భాగస్వామితో ఎలాంటి వాదనలు, గొడవలు పెట్టుకోకుండా.. ప్రేమగా ఉంటే.. ఈ రాశివారి జీవితం ఆనందంగా సాగుతుంది. ప్రతి విషయంలో ఓపెన్ గా ఉండి అన్ని విషయాలను పంచుకుంటే.. వారి సమస్యలు తీరుతాయి.
7.తుల రాశి..
మీ భాగస్వామితో నిరంతర సంభాషణ , స్పష్టత మీకు మంచి ప్రేమ జీవితాన్ని బహుమతిగా అందిస్తాయి. మీ భాగస్వామి ఆందోళనలు, నమ్మకాల పట్ల పరస్పర గౌరవం ఇవ్వాలి. అప్పుడు వీరి జీవితం బాగుంటుంది. సింగిల్ లైఫ్ అనుభవిస్తున్న వారికి వారు కోరుకున్న ప్రేమ దక్కతుంది.
8.వృశ్చిక రాశి..
మీ ప్రియమైన వ్యక్తికి వారి పట్ల మీ నిజమైన భావాలను తెలియజేయడానికి ఒక అవకాశాన్ని తీసుకోవడానికి వెనుకాడరు. సింగిల్స్ వారి మ్యాచ్‌ను కనుగొనడంలో గొప్ప అదృష్టాన్ని అనుభవిస్తారు మరియు భావాలు పరస్పరం పొందే అవకాశం ఉంది. మీ భాగస్వామికి మద్దతుగా మరియు నమ్మకంగా ఉండండి. వారిపై చిటికెడు విశ్వాసం మరియు కొంత నాణ్యమైన సమయం మాత్రమే మీరు లోతైన కనెక్షన్‌ని ఏర్పరచుకోవాల్సి ఉంటుంది.
9.ధనస్సు రాశి..
మిమ్మల్ని ఇష్టపడుతున్నవారి ప్రేమను ఒకే చేస్తే.. మీ లైఫ్ బాగుంటుంది. మిమ్మల్ని ఇష్టపడేవారిని నిర్లక్ష్యం చేయకూడదు. వారితో జీవితం చాలా ప్రశాంతంగా.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతుంది. వారితో సాన్నిహిత్యం మీకు మరింత మధురంగా ఉంటుంది.
10.మకర రాశి..
చాలా కాలంగా ఎదురుచూస్తున్న క్షణాలు చివరకు మీ తలుపు తట్టవచ్చు. మీ భాగస్వామి నుండి విస్తృతమైన వెచ్చదనం, మద్దతు మీ ప్రేమ జీవితంలో కొత్త మార్గాలను పొందేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. ప్రేమ విషయంలో మీ నమ్మకం నిజమౌతుంది. మీ జీవితం చాలా ఆనందంగా మారుతుంది. మీ ఆలోచనలలో చిక్కుకోకండి. మీ భాగస్వాములు మీ నుండి కొంత అవగాహన కోరుకుంటారు. ఆ విషయంలో కాస్త శ్రద్ధ వహిస్తే సరిపోతుంది.
11.కుంభ రాశి..
సింగిల్స్ మరింత ఓపిక పట్టవలసి ఉంటుంది. ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించ వద్దు. ఆల్రెడీ రిలేషన్ లో ఉన్నవారు.. పార్ట్ నర్ తో ఆనందంగా గడిపే అవకాశం ఉంది. ఒక్కోసారి మీ భాగస్వామి చిన్న చిన్న వాదనలకు కూడా సరిగ్గా స్పందించకపోవచ్చు కాబట్టి వాదనలకు దూరంగా ఉండండి. ఓపికగా కూర్చొని సమస్యలు పరిష్కరించుకుంటే వారి జీవితం ఆనందంగా సాగుతుంది.
12.మీన రాశి.
మీ భాగస్వామిపై అనవసరమైన కోపాన్ని మళ్లించకుండా ఉండండి.అభిప్రాయ భేదాల వల్ల వచ్చే చిన్న చిన్న సమస్యలను పట్టుకోకండి. సరళమైన, నిజాయితీతో కూడిన సంభాషణ మీ సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. విభేదాలను పక్కన పెట్టి, వారి సాంగత్యాన్ని ఆస్వాదించండి.