MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Maha Shivaratri 2026: శివాలయంలో పూజ చేశాక ఈ ఒక్క వస్తువును ఇంటికి తీసుకురండి, డబ్బు సమస్యలు తొలగిపోతాయి

Maha Shivaratri 2026: శివాలయంలో పూజ చేశాక ఈ ఒక్క వస్తువును ఇంటికి తీసుకురండి, డబ్బు సమస్యలు తొలగిపోతాయి

Maha Shivarathri: మహాశివరాత్రి కోసం శివ భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఆరోజు చేసే పనులు సంపదను, ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తాయి. పూజ చేశాక ఏ వస్తువును ఇంటికి తేవాలో తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 12 2026, 02:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మహాశివరాత్రి గొప్పతనం
Image Credit : Getty

మహాశివరాత్రి గొప్పతనం

మహాశివరాత్రి.. ప్రతి ఏటా వచ్చే అతి పెద్ద పండుగలలో ఒకటి. ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్షం చతుర్ధశి నాడు ఈ పవిత్రమైన పండుగ వస్తుంది. ఆ రోజు శివపార్వతులను భక్తితో ఆరాధిస్తారు. శివ భక్తులంతా ఈ పండుగ కోసం ఎంతో ఎదురు చూస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఈ పండుగ వచ్చింది. పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజే శివుడు పార్వతి కలిసారని చెప్పుకుంటారు. అదే రోజున శివుడు లింగ రూపంలో ఉద్భవించాడని అంటారు. ఈ రోజున శివలింగానికి అభిషేకం చేయడం చాలా శుభప్రదంగా చెప్పుకుంటారు. భక్తి, విశ్వాసంతో ఆ శివుడిని పూజించడం వల్ల జీవితంలోని అడ్డంకులు తొలగిపోయి గ్రహదోషాలు కూడా పోయి ఆనందం కలుగుతుందని అంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అభిషేకం చేయడం వల్ల లాభాలు
Image Credit : Getty

అభిషేకం చేయడం వల్ల లాభాలు

మహాశివరాత్రి రోజు శివలింగంపై ఖచ్చితంగా నీటితో అభిషేకం చేయాలి. అప్పుడే శివుడు ప్రసన్నమవుతాడని ఆ నమ్ముతారు. తర్వాత పాలతో అభిషేకం చేయాలి. దీని వల్ల ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది. ఇక పెరుగుతో అభిషేకం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. తేనెతో అభిషేకం చేయడం వల్ల వివాహ జీవితం తీపిగా మారుతుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. శివలింగంపై నెయ్యితో అభిషేకం చేస్తే మంచి సంతానం కలుగుతుందని నమ్ముతారు. ఇక అభిషేకం అయిన తర్వాత చివరగా పార్వతీదేవితో కలిపి శివుడుని పూజించాలి.

33
ఈ వస్తువులు ఇంటికి తీసుకురండి
Image Credit : Getty

ఈ వస్తువులు ఇంటికి తీసుకురండి

పూజలు పూర్తయ్యాక మహాశివరాత్రి నాడు శివాలయం నుండి మీరు కొన్ని రకాల వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఎంతో మంచిది. అభిషేకం తర్వాత శివలింగానికి మారేడు పత్రాన్ని ఇంటికి తీసుకురావడం పవిత్రంగా భావిస్తారు. దాన్ని మీ పర్సు లేదా డబ్బులు పెట్టే చోటా లేదా దేవుడి గుడిలో ఉంచడం మంచిది. అది ఇంట్లో సంపదను, శ్రేయస్సును అందిస్తుంది. అలాగే పార్వతీదేవికి ఆ రోజున సమర్పించిన గాజులు, సింధూరం వంటివి కూడా ఇంటికి తెచ్చుకొని వాటిని మీరు ధరిస్తే అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. వివాహ జీవితంలో ప్రేమ పెరుగుతుందని అంటారు. ఇక శివలింగంపై పోసిన నీటిని కూడా కలశంలో పట్టి ఇంట్లో నిలువ చేసి పెంచుకుంటే ఎంతో మంచిదని అంటారు. ఆ నీటిని ఇంటి నాలుగు మూలల్లో చల్లితే ప్రతికూల శక్తి దూరం అవుతుంది. ఇక అనారోగ్యంతో ఉన్న వ్యక్తిపై చల్లితే అతనికి ఆరోగ్యం దక్కుతుంది ముఖ్యంగా. సోమవారాల్లో ఈ నీటిని చల్లడం వల్ల ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
పండుగలు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. నూతన వాహన యోగం!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి దూరప్రాంతాల నుంచి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది!
Related Stories
Recommended image1
Gold History: ప్రపంచంలోనే మొదట బంగారు నగలు ధరించింది ఎవరు?
Recommended image2
Emerald Toe Ring: పచ్చల మెట్టెలు అదిరిపోయే డిజైన్లు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved