MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Zodiac Signs: ఈ 7 రాశుల అమ్మాయిల కోపాన్ని తట్టుకోవడం అంత ఈజీ కాదు!

Zodiac Signs: ఈ 7 రాశుల అమ్మాయిల కోపాన్ని తట్టుకోవడం అంత ఈజీ కాదు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కో రాశికి సంబంధించిన వ్యక్తులు.. ఒక్కో రకమైన ప్రవర్తన కలిగి ఉంటారు. కొన్ని రాశులకు చెందిన స్త్రీలు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటే.. మరికొన్ని రాశులకు చెందిన వారు ఎప్పుడూ కోపంగా ఉంటారు. జ్యోతిష్యం ప్రకారం ఈ 7 రాశుల అమ్మాయిల కోపాన్ని తట్టుకోవడం అంత ఈజీ కాదట. మరి ఆ రాశులెంటో ఓసారి చూసేయండి.

2 Min read
Author : Kavitha G
Published : May 16 2025, 12:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మేష రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశి వారు చాలా ధైర్యవంతులు. వారిలో ధైర్యంతో పాటు కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఏ విషయంలోనూ వెనుకడుగు వేయరు. ఇష్టం లేని దాని గురించి అసభ్యంగా చెప్పడానికి కూడా వెనకాడరు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
కన్య రాశి

కన్య రాశి

కన్య రాశి స్త్రీలు తమ కోపాన్ని నియంత్రించుకోలేరు. వారు తరచుగా ఇతరులతో గొడవ పడతుంటారు. వారి వాదన ఇతరులకు చికాకు కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో వారు కుట్రపూరితంగా ప్రవర్తిస్తారు. వీరు చిన్న తప్పులను కూడా సహించరు.

 

37
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు భావోద్వేగ వ్యక్తులు. వీరికి చాలా కోపం ఉంటుంది. ఈ రాశి స్త్రీలను ఎవరైనా రెచ్చగొడితే.. చాలా భావోద్వేగంగా స్పందిస్తారు. తమ కోపాన్ని వ్యక్తపరచడంలో వీరు చాలా చాకచక్యంగా ఉంటారు. ఎవరిచేతిలోనూ మోసపోవడాన్ని ఈ రాశి వారు సహించరు. అయితే, మోసం చేసినవారిని క్షమించే గుణం కూడా వీరికి ఉంటుంది.

47
కర్కాటక రాశి

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు సున్నితమైన, శ్రద్ధ కలిగిన వ్యక్తులు. వీరు ఎక్కువ భావోద్వేగంగా ఉంటారు. ఈ రాశివారు అప్పుడప్పుడు కోపంగా ఉంటారు. భావాలను మనసులో దాచుకుంటారు. నిరాశను దూకుడుగా చూపిస్తారు. వారి కోపం కారణంగా.. తరచుగా ఇతరులతో గొడవ పడి స్నేహితులు, బంధువులకు దూరంగా ఉంటారు.

57
వృషభ రాశి

వృషభ రాశి

వృషభ రాశి వారు బలమైన సంకల్ప శక్తి కలిగినవారు. వీరు తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి ఇష్టపడరు. ఒకవేళ కంఫర్ట్ జోన్‌ను దాటితే మొండిగా, కోపంగా ప్రవర్తిస్తారు. ఈ రాశి స్త్రీలు కోపాన్ని ప్రశాంతంగా, నియంత్రిత పద్ధతిలో చూపిస్తారు. కానీ వీరి కోపం చాలా బలంగా ఉంటుంది. చాలా కాలం పాటు ఉంటుంది. 

67
ధనుస్సు రాశి

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు తమ స్వతంత్రాన్ని ఎక్కువగా గౌరవిస్తారు. వారు ఆశావాదులు, సాహసోపేత వ్యక్తులు. వీరు కోపాన్ని జాగ్రత్తగా నిర్వహిస్తారు. అసంతృప్తి చెందినప్పుడు వారు తమ అభిప్రాయాన్ని సంకోచం లేకుండా స్వేచ్ఛగా వ్యక్తపరుస్తారు. హాస్య దృశ్యాలను చూడటం ద్వారా తమ కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రతికూల పరిస్థితిలో కూడా సానుకూల దృక్పథాన్ని అవలంబించి ముందుకు సాగడానికి ఇష్టపడతారు.
 

77
సింహ రాశి

సింహ రాశి

సింహ రాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా మొండివారు. ఈ లక్షణమే ఇతరులను కోపగించుకునేలా చేస్తుంది. వీరికి ఓపిక చాలా తక్కువ. వీరికి సరైన గౌరవం, గుర్తింపు లభించనప్పుడు కోపంగా ఉంటారు.
 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Recommended image2
Zodiac signs: పెళ్లి తర్వాత ఈ రాశుల జాతకమే మారిపోతుంది, అదృష్టం రెట్టింపు అవ్వడం పక్కా
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు.. తండ్రి జాతకాన్ని మార్చేస్తారు!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు మంచి భార్య అవుతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved