‘నేనే జాంబీ అయితే...’ అనుకుంటున్నారా? మీ రాశిచక్రం ఏం చెబుతుంది??
ఇప్పుడంతా జాంబీ ట్రెండ్... సినిమాలు, వెబ్ సిరీస్, సీరియల్స్.. ఇలా.. ఇక ఇంటర్నెట్ అంతా జాంబీ ఇన్ఫర్మేషన్ లో నిండిపోయింది. కొంతమంది సరదాగా జాంబీలైతే ఎలా అని కూడా ఆలోచిస్తుంటారు. నేనే జాంబీనైతే... జాంబీ ఎఫెక్ట్ తో ప్రంపంచం అంతమైపోతే.. ఇలా చేస్తా.. అని ఆలోచించేవాళ్లూ లేకపోలేదు. అలాంటి వారిలో మీరూ ఉన్నారా?

జాంబీలైనట్టు ఊహించుకోవడం.. జోంబీ అపోకాలిప్స్ సమయంలో మీరు ఎలా స్పందిస్తారో ఆలోచించడం.. సరదాగా ఉంటుంది. ఫాంటసీగా అనిపిస్తుంది. ఇది వాస్తవానికి చాలా దూరమైన విషయం అయినా కాసేపు రోజువారీ ఒత్తిళ్లనుంచి రిలీఫ్ నిస్తుంది. ఈ క్రమంలో మీరు జోంబీ ఇన్ఫెక్షన్ బారిన పడబోతున్నారా? లేక జోంబీనుంచి నివారణకు ప్రయత్నిస్తునారా? అనే విషయాలను మీరు మీ జాతకచక్రం ప్రకారం.. జ్యోతిష్యులు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతున్నారు. అలాంటి రాశులేంటో.. అందులో మీ రాశి కూడా ఉందేమో చూడండి..
Gemini
మిథునం (Gemini)
మిథున రాశివారు జోంబీ అపోకలిప్స్ సమయంలో చురుగ్గా పనిచేస్తారు. వెంటనే వారికి విషయం అర్థమైపోతుంది. తెలివిగా వ్యవహరిస్తారు. దానిమీద చాలా ఇమాజినేషన్స్ చేస్తుంటారు. జాంబీస్‌ను ఎలా ఎదుర్కోవాలి.. వాటి బారిన పడకుండా ఎలా జాగ్రత్తగా ఉండాలనే దానిపై వారికి చాలా ఆలోచనలు ఉంటాయి. మిథునరాశి వారికి ఉండే ఏకైక భయం, విసుగు మరణం. కాబట్టి, ఒకవేళ జోంబీ వ్యాప్తి చెందుతుందని తెలిస్తే, వెంటనే దాని బారిన పడకుండా వేగంగా చర్యలు తీసుకుంటారు.
Leo Zodiac
సింహం (Leo)
సింహరాశి వారు పుట్టుకతో లీడర్స్. మాటకు చివరి వరకు కట్టుబడి ఉంటారు. వీరు చాలా లాజికల్‌గా ఆలోచిస్తారు. తమతో పాటు తమ చుట్టూ ఉన్నవారిని ఇబ్బందుల నుండి తప్పించే ఫూల్ ప్రూఫ్ ప్లాన్‌ల కోసం చూస్తారు. సింహరాశి వారు జాంబీస్‌తో పోరాడుతూనే ఉండేందుకు, తప్పనప్పుడు కలిసి జీవించడానికి ఇతరులను కూడా ప్రేరేపించగలరు.
VIRGO
కన్యరాశి(Virgo)
కన్యరాశి వారు చిన్న చిన్న వివరాల మీద శ్రద్ధ చూపుతారు. అందుకే జోంబీ అపోకాలిప్స్‌ను అంతం చేయడానికి వారు నివారణను కనుగొంటారనడంలో ఆశ్చర్యం లేదు. కన్యారాశి వారు ఎలాంటి పరిస్థితిలోనైనా విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తారు. వారి సహజమైన తెలివితేటలు, వనరుల కారణంగా వారు ఉత్తమ పరిష్కారాలతో ముందుకు వస్తారు.
Sagittarius
ధనుస్సు (Sagittarius)
అపోకలిప్స్ నుండి బయటపడే అదృష్టవంతులలో ధనుస్సు రాశి వారు ఒకరు. వీరికి పర్యాటక ప్రదేశాలు, సురక్షిత ప్రదేశాల గురించి చాలా అవగాహన ఉంటుంది. దీనివల్ల వీరు ప్రమాదకరసమయంలో బయటపడడానిక చాలా అవకాశాలుంటాయి. వీరు ఎక్కువసేపు ఒకే చోట ఉండలేరు. ఇదే వారిని జోంబీ ఎఫెక్ట్ నుంచి బయటపడడానికి సహాయపడుతుంది. అలాంటి ప్రమాదరక సమయాల్లో ఇతరులను కూడా అదే విధంగా చేయమని సూచిస్తారు. ఒకరకంగా నాయకుడిలా వ్యవహరిస్తారు.
Capricorn
మకరం (Capricorn)
కష్ట సమయాల్లో ఎలా, ఎప్పుడు ముందుకు వెళ్లాలో మకరరాశి వారికి తెలుసు. కాబట్టి, ఒక జోంబీ అపోకాలిప్స్ వారి గ్రిట్‌ను పెద్దగా ప్రభావితం చేయదు. జాంబీస్ బారిన పడకుండా ఇతరులకు సహాయం చేయడానికి వీరు త్వరగా పరిష్కారాన్ని కనుగొంటారు. దానిని అమలు చేయడానికి కృషి చేస్తారు. జాంబీస్‌తో పోరాడాలని ఆలోచిస్తున్న గ్రూప్ ఏదైనా సరే వీరు పెద్ద అసెట్ గా మారతారు.