MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Astrology
  • ప్రతికూల శక్తుల నుంచి మీ ఇంటిని ఎలా రక్షించుకోవాలంటే?

ప్రతికూల శక్తుల నుంచి మీ ఇంటిని ఎలా రక్షించుకోవాలంటే?

 ఇంట్లో ప్రతికూల శక్తులుంటే ఏ పనులు ముందుకు సాగవు. అడుగడుగునా కష్టాలే ఎదురవుతాయంటారు జ్యోతిష్యులు. అందుకే ఇంటిని చెడు శక్తుల నుంచి ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Aug 31 2024, 04:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కొన్నికొన్ని సార్లు ఇంట్లో ఎలాంటి కారణం లేకుండా గొడవలు జరుగుతుంటాయి. వివాదాలు వస్తుంటాయి. ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. ఇంట్లో కుటుంబ సభ్యులు అనారోగ్యం బారిన పడుతుంటారు. అప్పుల సమస్యలు పెరిగిపోతుంటాయి. ఈ ఇంటికి ఏమైంది? ఇలా అయిపోయింది పరిస్థితి అని చాలా మంది ఆలోచన చేస్తుంటారు. అయితే వీటికి కారణం ప్రతికూల శక్తులే అని జ్యోతిష్యులు అంటున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

జ్యోతిష్యం ప్రకారం.. ఇంట్లో ప్రతికూల శక్తి ఉంటే.. ఆ ఇంట్లో అన్నీ చెడు ఘటనలే వరుసగా జరుగుతూనే ఉంటాయి. ఏ పనీ ముందుకు సాగదు. కాబట్టి మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

37

లవంగం : లవంగం వంటగదిలో ఉపయోగించే ఒక మసాలా దినుసు అన్న సంగతి అందరికీ తెలిసిందే. దీన్ని ఒక్క వంటల్లోనే కాదు.. ఇంట్లో ప్రతికూల శక్తులను వదిలించుకోవడానికి కూడా ఉపయోగించొచ్చు.దీని కోసం లవంగాల పొడిని ఇంటి మూలల్లో చల్లండి. దీనివల్ల ప్రతికూల శక్తులు రాకుండా నిరోధించడమే కాకుండా ఇంట్లో సానుకూల శక్తిని ఆకర్షిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

47

రోజ్మేరీ : రోజ్మేరీ కేవలం  జుట్టుకు మాత్రమే కాదు ఇంటికి కూడా శక్తివంతమైన మూలిక అని జ్యోతిష్యులు అంటున్నారు. పురాతన కాలం నుంచి దీనిని ఆచారాలలో ఉపయోగిస్తూ వస్తున్నారు. దీని కోసం రోజ్మేరీ ఆకులను తలుపుల దగ్గర ఉంచితే ఇంటిని చెడు శక్తుల నుంచి రక్షిస్తుంది. అంతేకాకుండా రోజ్మేరీ మొక్కను ఇంటి ప్రవేశ ద్వారం వద్ద లేదా బాల్కనీలో ఉంచితే ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదు.

57

గంట : ఇంట్లో గంటలను వేలాడదీస్తే ఇంట్లో సానుకూల శక్తి ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. గంటల నుండి వచ్చే శబ్దం, ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని విచ్ఛిన్నం చేసి సానుకూల శక్తిని సృష్టిస్తుంది. అందుకే దేవాలయాల్లోకి ఎలాంటి దుష్టశక్తి ప్రవేశించకుండా గంటలను ఏర్పాటు చేస్తారు. 

 

67

కర్పూరం వెలిగించడం : కర్పూరం హిందూ ఆచారాలలో ఒక ముఖ్యమైన భాగం. కర్పూరాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అలాగే ఇళ్లు శుభ్రపడుతుంది.ఇది సురక్షితమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. కర్పూరం నుంచి వచ్చే సువాసన, పొగ ఇంట్లో అన్ని ప్రదేశాలలోకి వ్యాపిస్తే ప్రతికూల శక్తి ఇంటి నుంచి పారిపోతుంది.

 

 

77

తెల్లని కొవ్వొత్తి : తెల్లని కొవ్వొత్తి ఆధ్యాత్మికంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంటే మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించడానికి తెల్లని కొవ్వొత్తిని ఉపయోగించొచ్చు. దీని కోసం ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర ఒక తెల్లని కొవ్వొత్తిని ఉంచండి. దీనివల్ల చెడు ఆలోచనలు ఉన్నవారు ఇంటిలోకి వచ్చి వెళ్లిన వెంటనే వారితో పాటు చెడు శక్తి కూడా వెళ్లిపోవడానికి కొవ్వొత్తిని వెలిగించి ఉంచండి. ఇది ఇంట్లో సానుకూల శక్తిని సృష్టిస్తుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు!
Recommended image2
Vastu Tips: ఇంట్లో చెప్పులు ఏ దిశలో పెడుతున్నారు? ఈ ఒక్క ప్లేస్ లో పెడితే.. మీ దరిద్రం మొత్తం పోయినట్లే..!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాలతో లాభాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved