80 ఏళ్ల తర్వాత గ్రహాల్లో మార్పులు.. ఆ రాశుల జీవితమే మారిపోతుంది..!
గ్రహాల్లో మార్పులు తరచుగా జరుగుతూనే ఉంటాయి. అయితే.. ఈసారి గ్రహాల మార్పు మాత్రం చాలా అరుదు అనే చెప్పాలి. దాదాపు 80 తర్వాత ఈ గ్రహాలలో మార్పులు జరుగుతున్నాయి. శని సశ, గజకేసరి, మహాలక్ష్మి, బుధాదిత్య, సమసప్తక రాజయోగాలు ఒకేసారి ఏర్పడుతున్నాయి. మరి.. ఈ 5 రాజ యోగాలు ఏ రాశులవారికి లాభం చేకూరుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
గ్రహాలు తరచూ రాశులను మార్చుకుంటూ ఉంటాయి. ఒక రాశి నుంచి మరో రాశికి మారుతూ ఉంటాయి. ఇలా గ్రహాలు రాశులను మార్చుకోవడం వల్ల.. ఇతర రాశులపై ప్రభావం పడుతూ ఉంటుంది. ఒకే రాశిలో ఎక్కువ గ్రహాలు ఒకేసారి రావడం మాత్రం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. దీపావళికి ముందు.. అంటే.. అక్టోబర్ 20వ తేదీన ఒకేసారి 5 రాజయోగాలు ఏక కాలంలో ఏర్పడబోతున్నాయి. దీని ప్రభావం.. కొన్ని రాశులపై చాలా ఎక్కువగా ఉందట.
ముఖ్యంగా కర్వా చౌత్ పండగ రోజున ఈ రాజయోగాలు ఏర్పడుతుుండటం విశేషం. ఈ సంవత్సరం కర్వా చౌత్ వ్రతం అక్టోబర్ 20న వస్తుంది. అందువల్ల, 80 ఏళ్ల తర్వాత కర్వా చౌత్‌లో 5 రాజయోగాలు ఏర్పడుతున్నాయి. శని సశ, గురు చంద్రుని నుండి గజకేసరి, మహాలక్ష్మి, సూర్య-బుధుల నుండి బుధాదిత్య, గురు-శుక్రుల నుండి సమసప్తక రాజయోగాలు ఏర్పడతాయి. దీనివల్ల కొన్ని రాశుల వారి అదృష్టం ప్రకాశిస్తుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
వృషభ రాశి..
వృషభ రాశి వారికి సంవత్సరాల తర్వాత 5 రాజయోగాలు కలిసి రావడం మంచి ఫలితాలను ఇస్తుంది. వివాహితులకు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి మంచి సమయం. అదృష్టం మీ వైపు ఉంటుంది.
తుల రాశి..
తుల రాశి వారికి 5 రాజయోగాలు రావడం వరం లాంటిది. ఉద్యోగంలో, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. కొత్త వ్యక్తులను కలుస్తారు. సౌకర్యాలు పెరుగుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు విజయం లభిస్తుంది. డబ్బు విషయాలు బాగుంటాయి. డబ్బు ఆదా చేయగలుగుతారు.
కన్య రాశి..
కన్య రాశి వారికి 5 రాజయోగాలు అదృష్టాన్నిస్తాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లభిస్తాయి. ఉద్యోగం కోసం చూస్తున్నవారికి ఉద్యోగం దొరుకుతుంది. పెళ్లి కానివారికి పెళ్లి సంబంధాలు వస్తాయి.
కుటుంబంలో ఉన్న సమస్యలు తీరతాయి. వాహనం కొనుగోలు చేయవచ్చు. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ధైర్యం, పరాక్రమం పెరుగుతాయి. ఉద్యోగం లేనివారికి ఉద్యోగం లభిస్తుంది. వివాహితులకు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.
5 రాజయోగాల ప్రయోజనాలు
జ్యోతిషశాస్త్రం ప్రకారం, శని లగ్నంలో లేదా చంద్ర రాశిలో కేంద్ర భావంలో ఉంటే, అంటే, ఒకరి జాతకంలో శని లగ్నంలో లేదా చంద్రుని నుండి 1, 4, 7, 10వ భావంలో తుల, మకర, కుంభ రాశులలో ఉంటే, ఆ జాతకంలో సశ రాజయోగం ఏర్పడుతుంది.
కర్వా చౌత్ ఫలాలు
గురు, బుధ, శుక్ర గ్రహాలలో ఏదైనా ఒక గ్రహంతో చంద్రుడు కేంద్రంలో ఉంటే, ఆ జాతకంలో గజకేసరి యోగం ఏర్పడుతుంది. లేదా, జాతకంలో లగ్నం, చతుర్థ, దశమ భావాలలో గురు, చంద్రులు కలిసి ఉంటే గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. చంద్రుడు లేదా గురువు ఒకరి ఉచ్ఛ రాశిలో ఉన్నా ఈ యోగం ఏర్పడుతుంది.
కర్వా చౌత్ 2024 ఫలాలు
జాతకంలో సూర్య-బుధులు కలిసి ఉండి, గురు-శుక్రులు ఒకరి భావం నుండి దూరంగా ఉంటే బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. శుక్ర-కుజులు కలిస్తే మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది.